దీంతో.. అతనిని ఐసీయూలో చేర్పించారు. అయితే.. అతను ఆస్పత్రిలో చేరిన వారానికే పెళ్లి చేసుకోవాల్సి ఉంది. కానీ పరిస్థితి దారుణంగా ఉండటంతో వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
అతనికి కరోనా వైరస్ సోకింది. అయితే.. ఆ వైరస్ తన ప్రాణాల మీదకు తెచ్చినా.. తమ ప్రేమను మాత్రం వేరు చేయలేదని ఆ యువకుడు నిరూపించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే.. తాన ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. అయితే.. అతని పెళ్లికి ఆస్పత్రిలోని డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, కుటుంబసబ్యులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. ఈ అరుదైన వివాహవ టెక్సాస్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
టెక్సాస్ కు చెందిన మునిజ్ అనే యువకుడు కరోనా బారిన పడ్డాడు. కరోనా పాజిటివ్ అని తేలగానే.. స్థానిక ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. అయితే.. కొద్ది రోజులకే అతని ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. దీంతో.. అతనిని ఐసీయూలో చేర్పించారు. అయితే.. అతను ఆస్పత్రిలో చేరిన వారానికే పెళ్లి చేసుకోవాల్సి ఉంది. కానీ పరిస్థితి దారుణంగా ఉండటంతో వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
undefined
మునిజ్ అనారోగ్యం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో అతనికి కోవిడ్ నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. గుండె, ఊపిరితిత్తుల సమస్యలకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతున్నా...మునిజ్, అతని ప్రియురాలి అభ్యర్థన మేరకు ఆస్పత్రిలోనే పెళ్లి జరిపించాలని వైద్యులు నిర్ణయించారు. ఆ మేరకు డాక్టర్లు, నర్సులు, వైద్యులు, ఇరు కుటుంబాలకు చెందిన కొందరి సమక్షంలోనే ఆస్పత్రిలో వారి పెళ్లి జరిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.