మాస్క్ పెట్టుకొని కూడా తినొచ్చు.. ఈ బుడ్డోడి తెలివి చూశారా..?

Published : Nov 21, 2020, 03:54 PM IST
మాస్క్ పెట్టుకొని కూడా తినొచ్చు.. ఈ బుడ్డోడి తెలివి చూశారా..?

సారాంశం

తనకు ఇష్టమైన లాలిపాప్ ని మాస్క్ తీయకుండానే తినడానికి మాస్టర్ ప్లాన్ వేశాడు. కాగా.. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. 

ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ నేపథ్యంలో  ఇంట్లో నుంచి బయటకు అడుగుపెటడితే మాస్క్ తప్పనిసరిగా మారింది. ఒక్కసారి మాస్క్ పెట్టుకున్నాక బయట తీయలేని పరిస్థితి. ఇక ఏదైనా తినాలంటే మళ్లీ మాస్క్ తీయాల్సిందే. అయితే.. మాస్క్ తీయకుండా.. చేతులతో పట్టుకోకుండా.. తినడానికి ఓ బుడ్డోడు భలే ఆలోచించాడు.

తనకు ఇష్టమైన లాలిపాప్ ని మాస్క్ తీయకుండానే తినడానికి మాస్టర్ ప్లాన్ వేశాడు. కాగా.. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ముఖానికి సర్జికల్‌ మాస్కు ధరించే మందే తనకు నచ్చిన లాలిపాప్‌ను మాస్కు బయటి నుంచి గుచ్చి నోట్లో పెట్టుకున్నాడు. దీంతో ఇటు మాస్కు పెట్టుకొని, అటు ఎంచక్కా తన చాక్లెట్‌ను తింటూ ఎంజాయ్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను లతా అనే మహిళ తన ట్విటర్‌లో పోస్టు చేశారు.

ఇప్పుడు నెట్టింట ఈ వీడియో వైరల్ గా మారింది. నెటిజన్లు ఆ బుడ్డోడి తెలివికి ఫిదా అయిపోతున్నారు. మాకు ఇప్పటి వరకు అలాంటి ఐడియా రానేలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

PREV
click me!

Recommended Stories

Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?
Open to Marry: నన్ను పెళ్లి చేసుకుంటారా? లింక్డ్‌ఇన్ లో యువకుడి పెళ్లి ప్రపోజల్ వైరల్