బిస్కెట్లనుకుందో ఏమో.. రూ.4 లక్షలు మింగేసిన పెంపుడుకుక్క.. యజమానులు చేసిన పని వైరల్..

By SumaBala Bukka  |  First Published Jan 6, 2024, 1:01 PM IST

అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఉండే క్లేటన్ అండ్ క్యారీ లా అనే ఓ జంట దగ్గర ఓ పెంపుడు కుక్క ఉంది. ఓ రోజు వారింట్లో ఉన్న నాలుగువేల డాలర్లు కనిపించకుండా పోయాయి. 


చాలామందికి పెంపుడు జంతువులను పెంచుకోవడం ఇష్టం. కుక్కలు,  పిల్లలను ఎక్కువగా పెంచుకుంటుంటారు. వాటిని సొంత కుటుంబ సభ్యుళ్లా ట్రీట్ చేస్తారు. కొన్నిసార్లు వాటి అల్లరి శృతి మించినా.. ప్రేమగా భరిస్తారు. అయితే, ఓ పెంపుడు కుక్క వీటన్నింటినీ దాటి.. అవాక్కయ్యేలాంటి పొరపాటు చేసింది. ఒకటి, రెండు కాదు ఏకంగా నాలుగు లక్షల రూపాయల కరెన్సీ నోట్లను మింగేసింది. ఆ తర్వాత వాటిని అరిగించుకోలేక అవస్థపడింది. ఈ విషయం యజమానులకు తెలియడంతో వారు చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది. 

ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే.. అమెరికాలోని పెన్సిల్వేనియాలో.  ఇక్కడ ఉండే క్లేటన్ అండ్ క్యారీ లా అనే ఓ జంట దగ్గర ఓ పెంపుడు కుక్క ఉంది. ఓ రోజు వారింట్లో ఉన్న నాలుగువేల డాలర్లు కనిపించకుండా పోయాయి. డబ్బు మొత్తం మాయం అవడంతో వారిద్దరూ షాక్ అయ్యారు. కాసేపు ఇద్దరు వాదులాడుకున్నారు. డబ్బు ఎవరు తీసారో, ఎలా పోయిందో అర్థం కాలేదు. 

Latest Videos

undefined

Viral: న్యూజిలాండ్ యంగ్ లీడర్ పవర్‌ఫుల్ స్పీచ్ వైరల్.. స్థానిక తెగ భాషతో దద్దరిల్లిన పార్లమెంటు

ఆ తర్వాత ఆ డబ్బుని తాము ముద్దుగా పెంచుకుంటున్న కుక్క తినేసిందని గుర్తించి అవాక్కయ్యారు. రాత్రివేళ ఆకలేసి కుక్క ఆ నోట్లను  తిన్నట్టుగా గుర్తించారు. వెంటనే దాన్ని వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. కుక్క కడుపులో అరగకుండా ఉన్న కొన్ని నోట్లు వాంతి రూపంలో బయటికి వచ్చాయి. అలా డబ్బులు కుక్క మింగిన సంగతి వారు గుర్తించారు. 

వెంటనే బ్యాంకులో తమ సమస్యను చెప్పారు.  అయితే వారు.. సీరియల్ నెంబర్లు దొరికితే నోట్లను రికవరీ చేస్తామని చెప్పారు. వెటర్నరీ డాక్టర్ సూచన మేరకు కుక్క వాంతి, మలంలోనుంచి బయటికి వచ్చిన నోట్లను సేకరించి, శుభ్రం చేశారు. అలా దాదాపుగా మూడు లక్షల రూపాయలను రికవరీ చేసుకోగలిగారు. కానీ మిగతా నోట్లు  దొరకలేదు. దీంతో వారికి లక్ష రూపాయల వరకు నష్టం జరిగింది. కుక్కపిల్లను పెంచుకున్న సరదా అలా తీరిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాస్ట్లీ కుక్క గురూ అంటూ నెటిజెన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. 

 

click me!