పార్లమెంట్‌లో గబ్బు పని: ఓ వైపు బడ్జెట్ ప్రసంగం... పోర్న్‌ చూస్తూ ఎంపీ బిజీ

Siva Kodati |  
Published : Sep 19, 2020, 04:49 PM ISTUpdated : Sep 19, 2020, 04:52 PM IST
పార్లమెంట్‌లో గబ్బు పని: ఓ వైపు బడ్జెట్ ప్రసంగం... పోర్న్‌ చూస్తూ ఎంపీ బిజీ

సారాంశం

ప్రజా సమస్యలు చేర్చించడంతో పాటు దేశ భవిష్యత్‌ను నిర్దేశించే పార్లమెంట్‌లో ఓ ఎంపీ సభ్య సమాజం తలదించుకునే పనిచేశాడు. కీలకమైన బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగానే పోర్న్ వీడియోలు వీక్షించాడు.

ప్రజా సమస్యలు చేర్చించడంతో పాటు దేశ భవిష్యత్‌ను నిర్దేశించే పార్లమెంట్‌లో ఓ ఎంపీ సభ్య సమాజం తలదించుకునే పనిచేశాడు. కీలకమైన బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగానే పోర్న్ వీడియోలు వీక్షించాడు.

వివరాల్లోకి వెళితే.. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని పార్లమెంట్ భవనంలో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో అక్కడే హాల్లో కూర్చొన్న ఎంపీ రొన్నాతెప్ అనువాత్ ఫేస్ మాస్క్ తీసేసి కూర్చొన్నారు.

ఆర్ధిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగం చదువుతుంటే రొన్నాతెప్ మాత్రం పోర్న్ ఫోటోలు చూడటంలో లీనమయ్యారు. ఈ వీడియో పార్లమెంట్ వీడియోలో రికార్డయ్యింది. అలా పది నిమిషాల పాటు ఎంపీ ఫోన్‌లోనే మునిగి తేలారు.

దీనికి సంబంధించిన ఫోటోలు  సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రొన్నాతెప్ ఖంగు తిన్నారు. అనంతరం తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఆశ్చర్యకరమైన వివరణ ఇచ్చారు.

ఓ అమ్మాయిల నుంచి సాయం కోరుతూ, డబ్బు ఇవ్వమని ప్రాధేయపడుతూ మెసేజ్‌లు వస్తున్నాయని చెప్పారు. నిజంగా వారు అత్యవసర పరిస్థితిలో ఉన్నారా లేదా అన్నది నిర్థారించుకునేందుకే ఇలా చేశానని చెప్పుకొచ్చారు.

ఆ అమ్మాయిలు కావాలనే డబ్బులు కోరారని అర్థం చేసుకోగానే ఆ ఫోటోలన్నింటినీ డిలీట్ చేసినట్లు రొన్నాతెప్ చెప్పారు. దీనిపై ఇతర ఎంపీలు అభ్యంతరం తెలపనందున సదరు ఎంపీపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Open to Marry: నన్ను పెళ్లి చేసుకుంటారా? లింక్డ్‌ఇన్ లో యువకుడి పెళ్లి ప్రపోజల్ వైరల్
Viral Video: ఇదేందయ్య‌ ఇది.! సెక్యూరిటీకే సెక్యూరిటా.. వీడియో చూస్తే ప‌డి ప‌డి న‌వ్వాల్సిందే