Mother Of The Year : పూల్ లో పడుతున్న బుడ్డోడిని మెరుపు వేగంతో కాపాడిన తల్లి.. వైరల్ వీడియో...

By SumaBala BukkaFirst Published May 4, 2022, 12:44 PM IST
Highlights

స్విమ్మింగ్ పూల్ లో పడుతున్న కొడుకుని మెరుపువేగంతో కాపాడుకుంది ఓ మహిళ. అదీ ఒంటిచేత్తో టీషర్ట్ పట్టుకుని పైకి లాగేసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారింది. 

ఇంటర్నెట్ లో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ తల్లి మెరుపు వేగంతో తన కొడుకును రక్షించే వీడియో.. ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నడుచుకుంటూ స్విమ్మింగ్ పూల్ లో పడబోయిన బాలుడిని సెకన్లలో ఆ తల్లి కాపాడిన తీరుకు ప్రశంసలు కురుస్తున్నాయి. 

ట్విటర్ లో షేర్ చేసిన ఈ వీడియోలో.. ఓ చిన్నారి నడుచుకుంటూ స్విమ్మింగ్ పూల్ వైపు వెడుతుంటాడు. అలా నడుచుకుంటూ పూల్ లో పడిపోబోతాడు.. ఇంతలో వెనకనుంచి ఆ బాలుడి తల్లి కళ్లుమూసి తెరిచేలోపు పరిగెత్తుకొచ్చి.. బాలుడి చొక్కా పట్టుకుని నీళ్లలో పూర్తిగా మునిగిపోకుండా కాపాడుతుంది. అలా చిన్నారిని రక్షించి ఒడ్డుకు చేరుస్తుంది. ఆ తల్లి అది గమనించకపోయినా.. ఒక్క నిమిషా ఆలస్యం అయినా ఆ చిన్నారి పరిస్థితి తలుచుకుంటే గుండె గుభేళుమంటుంది. 

ఈ వీడియోకు “మదర్ ఆఫ్ ది ఇయర్” అని టైటిల్ పెట్టి షేర్ చేసిందో ట్విట్టర్ యూజర్. ఆమె తన కొడుకు టీ-షర్టును పట్టుకుని, ఒంటిచేత్తే చాలా ఈజీగా పిల్లాడిని పైకి లేపుతుంది. ఈ వీడియో షేర్ చేసినప్పటి నుండి, ఇంటర్నెట్‌లో తుఫానుగా మారింది. ఇప్పటికే 477,000 మంది ఈ వీడియోను చూడగా, వేలకొద్దీ లైక్‌లు వచ్చాయి. మరి కొంతమంది ఇంటర్నెట్ వినియోగదారులు ఆమెను "సూపర్ మామ్" అని కొనియాడారు, 

ఒక యూజర్ ఇలా కామెంట్ చేశాడు..  "ఇది మూఢనమ్మకమో, కాదో నాకు తెలియదు కానీ.. పిల్లల భద్రత విషయానికి వచ్చేసరికి.. ఏదైనా ప్రమాదంలో పడతారు అనుకునేసరికి తల్లులందరికీ మానవాతీత సామర్థ్యాలు వస్తాయి. అతీత శక్తులు వస్తాయనుకుంటా..’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఇంకో యూజర్ అయితే..“స్పైడర్ మ్యాన్ కనుక నిజమే అయితే.. అతను కూడా ఇంత చాకచక్యంతో పిల్లవాడిని రక్షించలేడు.” అని కామెంట్ చేశారు. 

ఇదిలా ఉండగా, అలాంటిదే మరో ఘటనలో ఓ తల్లి తన కొడుకును లారీ యాక్సిడెంట్ నుంచి కాపాడింది. మదర్ ఆఫ్ ద ఇయర్ వీడియో నేపథ్యంలో ఇంగ్లండ్‌ క్రికెటర్‌ జోఫ్రా ఆర్చర్‌ స్పందించిన ఈ వీడియో తాజాగా మళ్లీ సోషల్‌ మీడియాలో మళ్లీ తెరపైకి వచ్చింది. వీడియోలో, ముగ్గురు వ్యక్తులు మోటారుసైకిల్‌పై ప్రయాణిస్తున్నప్పుడు వారు కారుకు తగులుకున్నారు. దీంతో బైక్ నడుపుతున్న వ్యక్తి అలాగే ఉండగా, బైక్ మీదున్న కొడుకు, తల్లి బైక్ నుండి పడిపోయారు. పడడం పడడం వేగంగా వస్తున్న ట్రక్కు కిందికి వెళ్లబోయారు. ఆ సమయంలో తల్లి చాలా నేర్పుగా, చాకచక్యంగా స్పందించి.. కొడుకును తన వైపు లాక్కోవడంతో.. ఆ చిన్నారి ట్రక్కు చక్కాల కింద నలగకుండా బయటపడ్డాడు. 

 

Mother of the year!👏 pic.twitter.com/TIXn8P85gx

— Figen (@TheFigen)
click me!