వీళ్ల తస్సాదియ్యా... మండే ఎండల్లో బారాత్ కు భలే ఐడియా చేశారు.. వైరల్ గా మారిన వీడియో..

By SumaBala Bukka  |  First Published Apr 29, 2022, 1:01 PM IST

మండుటెండల్లో పెళ్లి బారాత్.. బాబోయ్ ఉక్కపోత.. అనుకుంటున్నారా? అందుకే ఈ పెళ్లివారు కొత్తగా ఆలోచించారు. బారాత్ లో ఎండపడకుండా చేసిన వీరి ప్రయోగం ఇప్పుడు వైరల్ గా మారింది. 


ఏటికేడాది ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు ఎండాకాలంలోనే పెళ్లిళ్ల ముహూర్తాలు ఎక్కువగా వస్తాయి. పెళ్లిళ్ల సీజన్ ను కాదనలేక… భగభగ మండుతున్న ఎండలు భరించలేక… జనాలు కింద మీద అవుతుంటారు. ఇక ఈ మండేఎండల్లో పెళ్ళి ఊరేగింపులు, బారాత్ లు అంటే చాలా కష్టమైన విషయం. పెళ్లి లేకపోయినా పరవాలేదు.. ఈ ఉక్కపోత భరించలేంరా నాయనా  అనిపిస్తుంది ఒక్కోసారి. అయితే, మనం ఊరుకుంటామా ఏంటీ.. ఎలాంటి సమస్యకైనా భారతీయుల దగ్గర పరిష్కారం చిటికెలో లభిస్తుంది. అందులోనూ వినూత్నంగా ఆలోచిస్తుంటారు. మంటుటెండల్లో బారాత్ ఎలా చేయాలా? అనుకునేవారికి ఇదిగో ఇలా అంటూ చూపించారు ఓ పెళ్ళివారు.  

దీంతో ఈ వీడియో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింటవైరల్ గా మారింది. ఈ వీడియోలో పెళ్ళికొడుకు గుర్రంపై కూర్చుని ఉండగా.. బంధువులు, స్నేహితులు అందరూ డ్యాన్సులు చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. అయితే ఎండ వేడి నుంచి తప్పించుకునేందుకు పసుపు రంగు బట్టతో టెంట్ లాగా ఏర్పాటు చేసుకున్నారు. పూర్తిగా టెంట్ ఆకారంలో ఉండడమే కాదు అది ఊరేగింపుతో పాటు  ఆ టెంట్ కూడా కదిలేలా ఏర్పాట్లు చేశారు. దీంతో  గుర్రం మీద వరుడిని అనుసరించే బంధువర్గం అంతా ఎండ వేడి నుంచి తప్పించుకుని చక్కగా నీడలో నడుచుకుంటూ  ఊరేగింపులో పాల్గొన్నారు.

Latest Videos

undefined

‘భారతీయులు పెళ్లిళ్లకు కొత్త ఆవిష్కరణలు రూపొందించారు. భానుడి భగభగలు నుంచి తప్పించుకునేందుకు ఇలా టెంట్లు ఏర్పాటు చేసుకుని బారత్ జరుపుకుంటున్నారు’ అని ఈ వీడియోకి క్యాప్షన్ జోడించారు. మండే ఎండల్లో పెళ్లి అనగానే ఎలా తప్పించుకోవాలి అని ఆలోచించే వారికి... ‘అరే ఇదేదో కొత్తగా ఉందే..’ అని అనిపించేలా చేసింది ఈ ప్రయోగం.  అందుకే  బుధవారం నాడు పోస్ట్ చేసిన వీడియోని ఇప్పటికీ 18 వేల మంది వీక్షించారు.  కొంతమంది తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పంచుకున్నారు.

దీనికి చాలామంది రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.  ‘భారతీయుల దగ్గర ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది.  మేరా భారత్ మహాన్’ అని ఒక యూజర్ కామెంట్ చేయగా… ‘ఇది ఇండియన్ జుగాడ్ కాదు.. జుగాడ్ అంటే ఆవిష్కరణకాదు, అలాగని సరైన పరిష్కారమూ కాదు..  ఒక పిచ్చి రూట్లో సమస్యను పరిష్కరించడం అంటూ కొంతమంది కామెంట్ చేశారు, రోడ్లు రైల్వే ట్రాక్ లను ఇలా ఆకుపై చేస్తూ బారాత్ తీయడం సరైనదేనా.. అంటూ మరికొందరు విరుచుకుపడుతున్నారు. ఇది పబ్లిక్ న్యూసెన్స్  కిందికి వస్తుంది.. వీరిమీద కేసులు పెట్టాలంటూమరికొందరు అంటున్నారు. 

 

 

This is why is called land of Innovation or simply
"Jugaad" To beat the during "Baraat" Indians have found solution. pic.twitter.com/Fs8QociT2K

— Devyani Kohli (@DevyaniKohli1)
click me!