వ్యక్తిని బంధించి, ప్యాంటు విప్పించి.. నోటితో షూ తీయించారు.. వీడియో వైరల్, ముగ్గురు అరెస్ట్...

By SumaBala Bukka  |  First Published Jul 26, 2023, 10:56 AM IST

మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టి, బట్టలూడదీసి, చేతులు కట్టేసి.. నోటితో బలవంతంగా బూటు తీయించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే, రెండేళ్ల నాటి వీడియో కావడం గమనార్హం.


మధ్యప్రదేశ్‌ : మధ్యప్రదేశ్‌ కు చెందిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఆ వీడియో రెండేళ్ల క్రితం నాటిది కావడం గమనార్హం. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. ఓ వ్యక్తిని చేతులు వెనక్కి కట్టి.. ప్యాంటు విప్పించి... తీవ్రంగా కొడుతున్నాడో వ్యక్తి. ఆ తరువాత నోటితో బలవంతంగా బూటు తీయించాడు. 

ఈ వీడియో వైరల్ కావడంతో ప్రధాన నిందితుడిని, అతని ఇద్దరు సహచరులను పోలీసులు అరెస్టు చేశారు. మే 2021 నుండి మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో 34 ఏళ్ల వ్యక్తిని అర్ధనగ్నంగా చేసి.. కొట్టి, నోటితో షూ తీయమని బలవంతం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Latest Videos

undefined

ఫోన్ కొట్టేసిన దొంగతో ప్రేమలో పడిన మహిళ.. రెండేళ్లుగా సహజీవనం..

వైరల్ వీడియో ఆధారంగా, ప్రధాన నిందితుడిని, అతని ఇద్దరు సహచరులను పోలీసులు అరెస్టు చేశారు. వీడియోలో, ఆ వ్యక్తి తన చేతులు వెనుకకు కట్టివేసి, అర్ధనగ్నంగా కనిపించాడు. అతను తనపై దాడి చేసిన వ్యక్తిని వదిలేయమని వేడుకుంటున్నాడు, కానీ, అతనిని బంధించిన వ్యక్తి మాత్రం పదే పదే కొట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ వీడియో మే 2021లో రేవా జిల్లాలోని పిప్రాహి గ్రామంలో రికార్డ్ అయ్యింది. 

ఆస్తి తగాదాలే ఈ ఘటనకు కారణం అని పోలీసులు తెలిపారు. "వీడియో చూసిన తర్వాత,  ప్రధాన నిందితుడు గోండు తెగకు చెందిన జవహర్ సింగ్ (55)గా గుర్తించాం. అతడిని, అతనికి ఈ ఘటనలో సహకరించిన అతని ఇద్దరు సహచరులను అరెస్టు చేశాం" అని రేవా పోలీసు సూపరింటెండెంట్ వివేక్ సింగ్ తెలిపారు.

ప్రధాన నిందితుడు గ్రామ సర్పంచ్ భర్త అని, ప్రభుత్వ పాఠశాలలో క్లర్క్‌గా ఉద్యోగం చేస్తున్నాడని పోలీసు అధికారి తెలిపారు. బాధితుడిని సింగ్ కిడ్నాప్ చేసి, అర్ధనగ్నంగా చేసి, కొట్టిన తర్వాత నోటితో షూ తీయించాడు. జవహర్ సింగ్‌తో పాటు మరో ఇద్దరిపై భారత శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద శనివారం ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ప్రధాన నిందితుడు గిరిజనుడని, బాధితుడు అగ్రవర్ణానికి చెందినదని పోలీసులు తెలిపారు.

స్థానిక న్యాయస్థానం నిందితుడికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో గిరిజన కూలీపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన వీడియో ప్రజల ఆగ్రహానికి కారణమైన కొద్ది వారాలకే ఈ వీడియో వైరల్‌గా మారింది. గిరిజన కూలీపై మూత్ర విసర్జన చేసిన ప్రవేశ్ శుక్లాను పోలీసులు అరెస్ట్ చేశారు.

 

🌐 Rewa, Madhya Pradesh

🔘A disturbing incident took place in Piprahi village of Rewa district of Madhya Pradesh in which a young man was brutally attacked by the husband of the village sarpanch. pic.twitter.com/eEND95hHR8

— Haq ali (@ahaq84958)
click me!