గువాహటిలో బిజీ ట్రాఫిక్ ను కంట్రోల్ చేసిన వీధి బాలుడు... వీడియో వైరల్.. పోలీసులు ఏం చేశారంటే...

By SumaBala BukkaFirst Published Nov 17, 2022, 11:13 AM IST
Highlights

ట్రాఫిక్ ను నియంత్రిస్తున్న ఓ కుర్రాడి వీడియో గౌహతిలో వైరల్ గా మారింది. దీనిమీద ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించారు. ఇంతకీ విషయం ఏంటంటే.. 

గౌహతి : గువాహటిలో రద్దీగా ఉండే కూడలి వద్ద ఓ వీధి బాలుడు ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దీంతో చంద్‌మారీ ట్రాఫిక్ పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. తమ సిబ్బందిని ఆ ట్రాఫిక్ ఏరియాకు పంపించారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఆ బాలుడిని గువాహటీ నగరంలోని భాంగాఘర్ ప్రాంతానికి చెందిన అఫ్తుల్ అలీగా గుర్తించారు. 

ఏడేళ్ల ఈ బాలుడు ఆ ఏరియాలో ట్రాఫిక్ సిబ్బంది లేకపోవడంతో ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి ప్రయత్నం చేశాడు. స్టాప్, మూవ్ చెబుతూ... చక్కగా ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నాడు.. ఇది చూసిన కొంతమంది అతని ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. మరికొందరు.. ఏవైనా పెద్ద వాహనాలు అతని మీదినుంచి వెడతాయని కొప్పడ్డారు. అయితే, అలా తిట్లు తిన్నా కూడా ఆ చిన్నారి ట్రాఫిక్ ను నియంత్రిస్తూనే ఉన్నాడు. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వెంటనే ఆ ఏరియాలో ట్రాఫిక్ పోలీసుల్ని మోహరించారు. 

ఆటోలో ఇయర్ పాడ్స్ మర్చిపోయింది.. కానీ అరగంటలో అవి ఆమె దగ్గరికి చేరాయి.. ఎలాగో తెలిస్తే మీరూ ఆశ్చర్యపోతారు..

దీనిమీద ఒకరు మాట్లాడుతూ.. ‘నిజంగా.. ఆ చిన్నారి చేసిన పని చాలా మెచ్చుకోదగింది. ఎంత బాగా కంట్రోల్ చేస్తున్నాడో.. అయితే ఇది ట్రాఫిక్ పోలీసులు చేయాల్సిన పని’ అని చెప్పుకొచ్చాడు. ట్రాఫిక్‌ను అదుపు చేసేందుకు పోలీసు సిబ్బంది లేకుంటే కనీసం ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ అయినా ఏర్పాటు చేసి ఉండాల్సిందని మరొకరు అభిప్రాయపడ్డారు. ఒక ట్రాఫిక్ పోలీసు అధికారిని దీని గురించి అడిగినప్పుడు, కామర్స్ కాలనీ మార్గంలో ట్రాఫిక్ సిబ్బంది లేకపోవడానికి సిబ్బంది కొరతే కారణంగా పేర్కొన్నారు.

"మాకు చంద్‌మారి బ్రాంచ్‌లో చాలా తక్కువ మంది ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. అందుకే ఈ సమస్య తలెత్తింది. బుధవారం ఖానాపరాలో జరిగిన ఇతర ప్రభుత్వ కార్యక్రమంలో మా శాఖకు చెందిన నలుగురు పోలీసులు మోహరించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి మాకు మరింత సిబ్బంది అవసరం," అని డ్యూటీ పోలీసు చెప్పారు.

click me!