
విమానంలో ప్రయాణం చేసేటప్పుడు ఎయిర్ లైన్స్ పెట్టే నియమాలను తప్పెకుండా పాటించాలి. ఇతరుకు ఏమాత్రం ఇబ్బంది కలిగించకూడదు. చిన్న ఇబ్బంది పెట్టినా కూడా దానికి శిక్ష పడుతుంది. విమానంలో ఒక మహిళ తాగేసి… ఫోనులో పాటలు, వీడియోలు పెట్టుకుంది. చుట్టు ఉన్నవారికి ఇబ్బందిగా ఉన్నా కూడా పట్టించుకోలేదు. ఎయిర్ లైన్స్ సిబ్బంది ఇయర్‌ఫోన్ పెట్టుకోమని చెప్పినా కూడా నిరాకరించించింది. ఫోన్‌లో పెద్దగా సౌండ్ పెట్టుకుని వీడియో చూస్తూ తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టింది. ఎంత చెప్పిన ఆ మహిళ వినకపోవడం ఆమెను ఫ్లైట్ నుంచి కిందకు దించేశారు. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ ఘటన జరిగింది. ఘటన అమెరికాలో జరిగినా కూడా వీడియో మాత్రం ప్రపంచమంతా వైరల్ అవుతోంది.
పెద్ద సౌండ్‌తో వీడియో..
విమానంలో జరిగిన ఈ ఘటనను తోటి ప్రయాణికుడు ఒకరు తన మొబైల్‌లో వీడియో తీసి అమెరికాలో టిక్‌టాక్‌లో పోస్ట్ చేశారు. ఆ మహిళ ఫుల్లుగా తాగి ఉంది. వీడియో చూస్తున్నప్పుడు హెడ్‌సెట్ పెట్టుకోవాలని సిబ్బంది చెప్పినా కూడా ఆమె నిరాకరించి పెద్ద సౌండ్‌తో వీడియో ప్లే చేసింది. ఈ విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్) యూజర్ కూడా పోస్టు చేస్తారు.
నిజానికి విమానం ఎక్కుతున్నప్పుడే ఆమె పెద్ద సౌండ్ తో ఫోన్ వాడుతోంది. గేట్ దగ్గర నుంచి కదలక ముందే సిబ్బంది ఆమెను హెడ్‌ఫోన్‌లు వాడమని చెప్పారు. కానీ ఆ మహిళ వెంటనే కోపంతో తిట్టడం ప్రవర్తించింది. అయితే అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగులు ఈ పరిస్థితిని చాలా హుందాగా ఎదుర్కొన్నారు. వైరల్ అయిన వీడియోలో తనను కిందకు దించేస్తుండటంతో ఆ మహిళ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయడం చూడవచ్చు. కేవలం 30 సెకన్ల వీడియోను 50 శాతం సౌండ్‌తో చూస్తున్నాను. దీనికే నన్ను ఫ్లైట్ నుంచి బయటకు పంపిస్తారా?" అని ఆమె సిబ్బందితో గొడవపడింది. ఆ తర్వాత పోలీసులు, విమాన సిబ్బంది కలిసి ఆమెను విమానం నుంచి బయటకు తీసుకెళ్లారు.
హెడ్‌ఫోన్‌లు లేకుండా ఆడియో లేదా వీడియోను గట్టిగా ప్లే చేసే ప్రయాణికులను విమానం నుంచి దించివేయడం లేదా వారిపై నిషేధం విధించడం వంటి కఠిన చర్యలు తీసుకుంటామని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఇప్పటికే హెచ్చరించింది. ఫిబ్రవరిలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ తమ refusal to transport పాలసీని అప్‌డేట్ చేసింది. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వకుండా ఆపే కారణాలను ఇందులో వివరించింది.