కాబోయే భర్త కోసం బోర్డు పట్టుకుని రోడ్డెక్కింది ఓ యువతి. ఇప్పుడీ వార్త వైరల్ గా మారింది.
అమెరికా : జీవిత భాగస్వామి కోసం ఎలా వెతుకుతారు? తెలిసిన వాళ్ళు ఉంటే ఫలానా అమ్మాయి ఉందనో… ఫలానా అబ్బాయి పెళ్ళికి ఉన్నాడనో సంబంధాలు కలుపుతారు. మరోవైపు పెళ్లిళ్ల పేరయ్యాలు.. వీరి అడ్వాన్స్ రూపం మ్యాట్రిమోనీ సైట్ లు ఎన్నో ఉన్నాయి. ఇక నేటి యువతరం…ఒక అడుగు ముందుకు వేసి తమ జీవిత భాగస్వామిని తామే ఎంచుకుంటున్నారు. అన్ని రకాలుగా తమకు సరిపోతేనే వివాహాలు చేసుకుంటున్నారు.
అయితే, ఎన్ని రకాలుగా కలిసే విధంగా చూసుకున్నా కూడా కొన్నిసార్లు మిస్సైర్ అవుతుంటాయి. అన్నీ అనుకున్నట్టుగా దొరకడం కష్టమే. అనువైన జీవిత భాగస్వామిని దక్కించుకోవాలంటే చాలా కష్టమైన పనే. అందుకే ఎక్కువగా డేటింగ్ యాప్లను ఆశ్రయించే వాళ్ళు కనిపిస్తుంటారు. ఇందులోనూ అలా కష్టమే అనుకుందో ఏమో ఓ యువతి తన జీవిత భాగస్వామి కోసం వినూత్నంగా ప్రయత్నించింది.
undefined
అమెరికాకు చెందిన కరోలినా గీట్స్ అనే యువతి రెండేళ్లుగా సింగిల్ గా ఉంటుంది. ఆమె బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్. తన కాబోయే భర్తను ఎంచుకోవడం కోసం వినూత్నప్రయోగం చేపట్టింది. అదేంటంటే… తాను తనకు కాబోయే జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నానంటూ ఓ బోర్డు మీద రాసి.. చేతిలో పట్టుకుని రోడ్డుమీద నిలబడింది. అలా ఆమె ఆ బోర్డుతో పట్టణంలో తిరుగుతోంది.
ఇది గమనించిన మీడియా కరోలినా గీట్స్ వెంటపడింది. ఈ వినూత్న ప్రయత్నం గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ… ‘భర్త కావాలి’ అని తాను వెతుకుతున్నట్లు రాసిన సైన్ బోర్డును పట్టుకొని నగరంలో తిరుగుతున్నానని తెలిపింది. తాను ఇప్పటికే టిండర్, హింజ్ లాంటి డేటింగ్ యాప్ లతో కొంతమంది పురుషులతో స్నేహం చేసినట్లుగా చెప్పుకొచ్చింది. కానీ తనకు వారెవరో నచ్చలేదని టైం వృధా అని తెలిపింది.
అందుకే తాను ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఆమె బోర్డు పట్టుకుని నగరంలోని రోడ్ల మీదకి వెళ్ళింది. ఆమె శ్రమ 30 నిమిషాల్లోనే ఫలించింది. ఓ వ్యక్తి ఆమెకు ఎదురయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి సుముఖత వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరు ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. దీనిమీద కరోలినా గీట్స్ మాట్లాడుతూ.. తనకు ఇదంతా కొత్తగా ఉందని ఈ పరిచయం ఎక్కడికి దారితీస్తుందో చూడాలని.. ఇకమీద తామద్దరం ఒకరినొకరు తెలుసుకోవాల్సి ఉందని చెప్పుకొచ్చింది.