‘బండిమీద చేయేస్తే.. నరికేస్తా...’ : సీ లింక్‌పై మహిళా బైకర్ హల్ చల్.. వీడియో వైరల్

By SumaBala Bukka  |  First Published Sep 25, 2023, 11:21 AM IST

బాంద్రా-వర్లీ సీ లింక్‌పైకి బుల్లెట్ బైక్‌ నడుపుతూ వచ్చిన మహిళను అతివేగంగా నడుపుతున్నందుకు పోలీసులు ఆపారు. దీంతో మహిళా బైకర్ పోలీసులను బెదిరించడం, ట్రాఫిక్ పోలీసులను దుర్భాషలాడడం సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. 


ముంబై : ముంబైలోని బాంద్రా-వర్లీ సీ లింక్ మీద గందరగోళం నెలకొంది. ఓ మహిళ బుల్లెట్ నడుపుతూ దీనిమీదికి వచ్చింది. టూ వీలర్ అనుమతి లేదు అని పోలీసులు ఆపితే వారితో వాదనకు దిగింది. తన బండిమీద చేతులు వేస్తే.. చేతులు నరికేస్తా.. అంటూ హంగామా సృష్టించింది. 

ఆ మహిళ పేరు నూపుర్ ముఖేష్ పటేల్. సీ లింక్‌పై బుల్లెట్ నడుపుతూ దక్షిణ ముంబై వైపు వెళుతుంది. ఈ మేరకు బాంద్రా-వర్లీ సీ లింక్ సెక్యూరిటీ సిబ్బంది నుండి తమకు కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లారు. కానీ ఆమె వారితో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగింది. 

Latest Videos

undefined

వయనాడ్ నుంచి కాదు.. హైదరాబాద్ నుంచి పోటీ చేసి గెలవాలి - రాహుల్ గాంధీకి ఒవైసీ సవాల్..

"పోలీసు సిబ్బంది ఆమెను ఆపారు. ఆమె వారితో వాదించడం మొదలుపెట్టింది. ఇది నా బాప్ కా రోడ్... నేను పన్ను చెల్లిస్తున్నాను. దీనిమీద వెళ్లకుండా నన్నెవ్వరూ ఆపలేరు. అంటూ హల్ చల్ చేసింది. ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ, ఆమె తన ద్విచక్ర వాహనాన్ని రోడ్డుకు ఒకవైపు తీసుకెళ్లేందుకు సిద్ధంగా లేదు.ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగింది' అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

"ఆమె అనవసరమైన వాదనలకు దిగింది. ఒక కానిస్టేబుల్‌ను కూడా నెట్టింది" అని అధికారి తెలిపారు, ఆమెపై అడ్డంకి, నిర్లక్ష్యంగా డ్రైవింగ్, అపాయం, ప్రభుత్వ సేవకుడిపై దాడికి పాల్పడడం లాంటి వాటికింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

పటేల్ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నివాసి, బుల్లెట్ అక్కడి రియల్ ఎస్టేట్ సంస్థలో రిజిస్టర్ చేయబడింది. విచారణ అధికారి ముందు హాజరు కావాలంటూ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 41A కింద ఆమెకు నోటీసులు ఇచ్చారు. ఆ తరువాత ఆమె వెళ్ళడానికి అనుమతించారు. 

click me!