గ్రాడ్యుయేషన్ వేడుకలో కుక్కకు డిప్లొమా పట్టా.. ఎందుకో తెలిస్తే మీరూ అబ్బురపడతారు..

By SumaBala Bukka  |  First Published May 29, 2023, 9:37 AM IST

ఓ సర్వీస్ డాగ్ డిప్లొమా పట్టా అందుకుంది. తన యజమాని సరిగా క్లాసులు పూర్తి చేయడానికి అది చేసిన నిరంతర సేవకు గుర్తింపుగా ఆ యూనివర్సిటీ శునకాన్ని అలా గౌరవించారు. 


ఇంటర్నెట్‌ని అత్యంత సంతోషకరమైన ప్రదేశంగా మార్చే విషయం ఏంటోమీకు తెలుసా? జంతువుల వీడియోలు.. ముఖ్యంగా పెంపుడు కుక్కల వీడియోలు. వాటికీ మనుషులకు ఉన్న అత్మీయానుబంధానికి సంబంధించిన వీడియోలు చాలా వైరల్ అవుతాయి. అలాంటి కోవలోకి వచ్చే ఓ అపురూపమైన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. 

న్యూజెర్సీలోని సెటన్ హాల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ వేడుక సందర్భంగా తీసిన వీడియో ఇది. ఈ వీడియో వైరల్ కావడం వెను సరైన కారణాలున్నాయి. యూనివర్శిటీ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన ఈ వీడియోలో ఒక స్పెషల్లీ ఏబుల్డ్ విద్యార్థి తన వీల్ చైర్‌లో పోడియం వద్దకు రావడం కనిపిస్తుంది. ఆమెతో పాటు, ఓ సర్వీస్ డాగ్ ఆ విద్యార్థికి మార్గనిర్దేశం చేస్తుంది. ఆ సర్వీస్ డాగో తన పావ్-సమ్ సర్వీస్ కోసం డిప్లొమా పొందడంతో వీడియో ముగుస్తుంది.

Latest Videos

undefined

ఇదెక్కడి విడ్డూరం.. ఆ రాయికి సెగ తగిలిస్తే.. ఇంటర్నెట్, వైఫై సిగ్నల్స్.. ఎక్కడంటే..

“సెటన్ హాల్ ప్రెసిడెంట్ జోసెఫ్ ఇ. నైర్, పీహెచ్ డి మహ్వా, ఎన్ జేకి చెందిన గ్రేస్ మరియాని సర్వీస్ డాగ్ జస్టిన్‌కి, సెటన్ హాల్‌లో గ్రేస్ క్లాస్‌లన్నింటికీ హాజరైనందుకు డిప్లొమాను అందజేస్తుంది" అని దీనికి క్యాప్షన్ రాశారు. “జస్టిన్ ఆరేళ్ల ల్యాబ్/గోల్డెన్ రిట్రీవర్ మిక్స్ డాగ్.. దీనికి గ్రేస్ @canineorg నుండి తీసుకుంది. ఆమె బి.ఎస్. పట్టభద్రురాలైంది. ఎడ్యుకేషన్‌లో, మాగ్నా కమ్ లాడ్, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్‌ను బోధించాలని కోరుకుంటున్నాను ”అని అన్నారామె.

ఈ అబ్బురమైన వీడియోకు ఇప్పటికే 28వేలకు పైగా లైక్‌లు.. వందలాడి రిప్లైలు వచ్చాయి. ప్రజలు స్వీట్ డాగ్‌పై అభినందనల వర్షం కురిపిస్తున్నారు.  స్పెషల్లీ ఏబుల్డ్ గా ఉండి.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినందుకు విద్యార్థినిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. 

click me!