కస్టమర్ పూల కుండీని పగలగొట్టి.. డెలివరీ బాయ్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. ట్వీట్ వైరల్..

By SumaBala Bukka  |  First Published Jun 2, 2023, 2:23 PM IST

ఒక డెలివరీ మ్యాన్ ఫుడ్ డెలివరీ చేయడానికి కస్టమర్ ఇంటికి వచ్చి..  ప్రమాదవశాత్తు వారి పూల కుండీని పగలగొట్టాడు. ఆ తర్వాత అతను చేసిన పనికి నెటిజన్లు ఫిదా... 


ఫుడ్ డెలివరీ బాయ్స్ చేసే విచిత్రాల గురించి తెలిసిందే. కస్టమర్ల ఫుడ్ ఎంగిలి చేసి ఇచ్చిన ఘటనలూ వెలుగు చూశాయి. డెలివరీ చేయాల్సిన ఫుడ్ తినేసి అందులో వేరే పెట్టి ఇచ్చేసిన ఘటనలకు చెందిన వార్తలూ చూశాం. కానీ ఇది దానికి పూర్తిగా భిన్నమైన స్టోరీ. ఓ ఫుడ్ డెలివరీ బాయ్ సున్నిత మనస్సుకు నిదర్శనం. ఇంతకీ ఏం జరిగిందంటే.. 

ఒక డెలివరీ మ్యాన్ ఫు డెలివరీ చేయడానికి ఒకరి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంో ప్రమాదవశాత్తు కస్టమర్ పూల కుండీను పగలగొట్టాడు. తర్వాత అతను చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సంఘటనను ఎలి మెక్‌కాన్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. ‘మా ఆయన బయటి నుండి ఫుడ్ ఆర్డర్ చేశాడు. డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఇంటికి వచ్చినప్పుడు, అనుకోకుండా వరండాలో ఉంచిన పూల కుండీని పగలగొట్టాడు. 

Latest Videos

undefined

ఆ వ్యక్తి క్షమాపణ చెప్పడానికి మావారిని పిలిచాడు. ఆ కుండీకి డబ్బులు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు...కానీ మా వారు అతడిని మెచ్చుకున్నారు. నీ మనసు మంచిది. అందుకే పగిలిన కుండీకి డబ్బులిద్దామనుకున్నావు.. కానీ అది ఎవరివల్లైనా పగిలిపోవచ్చు.. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ అతనిని పంపించేశారు’ అని ట్విట్టర్ లో ఓ పోస్ట్ షేర్ చేసింది.  

రెండు రోజుల తరువాత దీనికి సంబంధించే రెండు ఫోటోలు షేర్ చేస్తూ.. మరో పోస్ట్ పెట్టింది. దీనికి నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ అప్ డేట్ పోస్టులో డెలివరీ మ్యాన్ జోర్డాన్ చేతితో రాసిన నోట్‌తో పాటు కొత్తగా కొన్న పూల కుండీని చూపించే రెండు ఫోటోలను షేర్ చేసింది. "ఫుడ్ డెలివరీ బాయ్.. ఇప్పుడే దీన్ని వదిలేసి వెళ్లాడు. నేను ఇంటికి వెళుతున్నప్పుడు అతడు ఎదురయ్యాడు. ఎంటిలా వచ్చావని అడిగాను.. అతను చాలా మర్యాదగా మాట్లాడాడు. ఆ రోజు జరిగింది ట్వీట్ చేశానని.. అది వైరల్ అయిందని చెప్పాను. అతను దానికి చాలా సంతోషపడ్డాడు’..అని తను ట్వీట్ చేశారామె.

డెలివరీ బాయ్ రాసిన లెటర్ లో ఇలా ఉంది.. “హలో.. నేను.. ఇట్స్ యువర్ ఉబెర్, ఈట్స్ డ్రైవర్ జోర్డాన్. మొన్న ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తూ మీ కుండీని పగలగొట్టాను. దానికి బదులు మరొకటి ఇవ్వాలనుకున్నాను. ఇది మీకు బహుమతి కాదు.. లేదా ఏదో సెంటిమెంట్ కూడా కాదు.. మీ మంచి మనసుకు నాకు ఇలా ఇవ్వాలనిపించింది. మీ పాత కుండీ అంత విలువైంది కాదు కానీ.. ఏదో ఒకదానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. -జోర్డాన్" అని రాశాడు.

ఎలీ మరియు ఆమె కుటుంబ సభ్యులే కాదు, ఇంటర్నెట్ కూడా ఈ చర్యకు అతనిమీద అభిమానం కురిపించింది. ఒకరు స్పందిస్తూ..  “ఈ మొత్తం స్టోరీని మీరు UberEatsకి ట్యాగ్ చేశారా? అతను ఎంత ప్రత్యేకమైనవాడో వారు తెలుసుకోవాలి. నేను వారిని ట్యాగ్ చేయలేను, కానీ మీరు చేయగలరు”అని ఒక వినియోగదారు సూచించారు.

 

The food delivery guy just dropped this off. I caught him as I was pulling up to the house and he was so sweet. I told him I tweeted about the interaction and that it went viral and he got a kick out of that. https://t.co/5TXGdwXMbH pic.twitter.com/qcaMZdXSGE

— Eli McCann (@EliMcCann)
click me!