కాసేపట్లో అంత్యక్రియలు... స్మశానంలో లేచి శ్వాస తీసుకున్న మహిళ

By Siva KodatiFirst Published Aug 25, 2020, 2:32 PM IST
Highlights

చనిపోయారనుకున్న వ్యక్తులు స్మశానంలో చివరి నిమిషంలో బతికిన ఘటనలు ఎన్నో చూశాం. అమెరికాలో తాజాగా అచ్చం అలాంటి సంఘటన జరిగింది. 

చనిపోయారనుకున్న వ్యక్తులు స్మశానంలో చివరి నిమిషంలో బతికిన ఘటనలు ఎన్నో చూశాం. అమెరికాలో తాజాగా అచ్చం అలాంటి సంఘటన జరిగింది. చనిపోయిందనుకున్న 20 ఏళ్ల మహిళ స్మశానంలో ఒక్కసారిగా ఊపిరి పీలుస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

వివరాల్లోకి వెళితే... ఆదివారం డెట్రాయిట్‌‌లో గుర్తు తెలియని మహిళ పారామెడిక్స్‌కు ఫోన్ చేసి ఒక ఇంట్లో అపస్మారక స్థితిలో 20 ఏళ్ల మహిళ ఉన్నట్లు తెలిపింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పారామెడిక్స్ ఆ మహిళకు పరీక్షలు నిర్వహించిన మరణించినట్లు ధ్రువీకరించారు.

దాదాపు 30 నిమిషాల పాటు సీపీఆర్, ఇతర ప్రక్రియలను నిర్వహించారు. శ్వాస ఆడకపోవడం, గతంలోని రిపోర్టుల ఆధారంగా పారామెడిక్స్ ఆమె మరణించినట్లు నిర్ణయానికి వచ్చారు.

దీంతో ఆమెను జేమ్స్ కోల్ స్మశానవాటికకు తీసుకెళ్లారు. అయితే అక్కడ ఎంబాల్మింగ్ ప్రక్రియ నిర్వహించే సమయంలో ఆ మహిళ శ్వాస పీల్చుకోవడాన్ని బంధువులు, కుటుంబసభ్యులు గుర్తించారు.

దీంతో ఆ మహిళను క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తరలించారు. వెంటనే ఆమెను పరీక్షించిన వైద్యులు ప్రస్తుతం పల్స్‌రేట్, ఆక్సిజన్ లెవల్స్ బాగున్నాయని పేర్కొన్నారు. 

click me!