వదిలే ప్రసక్తే లేదు... నారా లోకేశ్ పై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు: వైసిపి ఎమ్మెల్యే

By Arun Kumar PFirst Published Nov 13, 2019, 4:15 PM IST
Highlights

టిడిపి జాతీయ కార్యదర్శి  నారా లోకేశ్ పై వైసిపి ఎమ్మెల్యే మల్లాది విష్ణు విరుచుకుపడ్డారు. గౌరవప్రదమైన స్పీకర్ స్థానంలో వున్న తమ్మినేని సీతారం పై పరుష వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. 

అమరావతి: అధికారాన్ని చేపట్టిన కేవలం ఐదు నెలల్లోనే ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడాన్ని టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు చూడలేకపోతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్  శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అందుకే ఏదో కారణంతో అధికార పార్టీపై, ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని...ఇప్పుడు ఇసుక రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

అంతేకాకుండా నిరుపేద చిన్నారులకు ఇంగ్లీష్ ను దగ్గరచేసి వారి భవిష్యత్ ను తీర్చిదిద్దాలని సీఎం జగన్ ప్రయత్నిస్తుంటే దాన్ని కూడా చంద్రబాబు రాజకీయం  చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రభుత్వ  పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలన్న మంచి నిర్ణయంపై అనవసరమైన రాద్దాంతం చేస్తూ దుష్ర్పచారం చేయడం తగదన్నారు. 

మరో వైసిపి ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ... అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడిపి ఈ-పేపర్లో అసభ్యమైన రాతలు రాయడంపై మండిపడ్డారు. టిడిపి జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్, అచ్చెన్నాయుడు, కూన రవి కుమార్ లు స్పీకర్ గురించి దిగజారి మాట్లాడారని గుర్తుచేశారు. వారిపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు.

 read more వేడెక్కిన ఇసుక రాజకీయం... చంద్రబాబు దీక్షా స్థలంలోనే వైసిపి ఎమ్మెల్యే దీక్ష

ఏపీలో చంద్రబాబు ఇసుక దీక్ష కేవలం దుష్ప్రచారం చేయడానికేనని...దీని వల్ల భవన నిర్మాణ కార్మికులకు ఒరిగేదేమీ లేదన్నారు. ఆంధ్రాలో ఇసుక మాఫియాను పెంచి  పోషించింది చంద్రబాబు నాయుడేనని, అలాంటి వ్యక్తి ఇసుక కొరత మానవ తప్పిదమని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. కేవలం వర్షాల కారణంగానే ఇసుక సరఫరాకు గతంలో కొంత అంతరాయం ఏర్పడిందని అన్నారు.

ఇసుక అక్రమంగా అమ్మితే జైలు శిక్ష విధించాలని ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుందన్నారు. రాజకీయాల్లో లంబు జంబులాగా టీడిపి జనేసేన మారిపోయాయని...ఏ మొహం పెట్టుకుని టిడిపి నాయకులు పవన్ కళ్యాణ్ ను కలిశారని అన్నారు. 

read more  ఇసుక కృత్రిమ కొరత సాండ్ మాఫియా పనే...వీరి అండతోనే...: చంద్రబాబు

ప్రస్తుతం రాష్ట్రంలో 1.20 లక్షల టన్నుల ఇసుక ప్రతి రోజూ అందుబాటులో ఉన్నదన్నారు. ఇలా ఇప్పటికే సమస్య తీరి ప్రజలకు సమృద్దిగా ఇసుక లభిస్తున్నా ఇసుక మాఫియా కోసమే చంద్రబాబు దీక్ష చేపడుతున్నారని  మల్లాది విష్ణు ఆరోపించారు. 
 

click me!