ఇసుక కృత్రిమ కొరత సాండ్ మాఫియా పనే...వీరి అండతోనే...: చంద్రబాబు

By Arun Kumar PFirst Published Nov 13, 2019, 3:01 PM IST
Highlights

 ఇసుక కృత్రిమ కొరతను వైసిపి నేతలే సృష్టించారని, శాండ్ మాఫియాగా ఏర్పడి  రాష్ట్రంలోని ఇసుక మొత్తాన్ని దోపిడి చేస్తున్నారని టిడిపి అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఇలా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర అభివృద్దిని అడ్డుకున్నారని... రాష్ట్రానికి ఇంత నష్టం, ప్రజలకు ఇంత కష్టం ఎప్పుడూ కలగలేదని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. 

గుంటూరు: భవన నిర్మాణ కార్మికుల్లో భరోసా పెంచేందుకు గురువారం చేపట్టనున్న దీక్షకు కృష్ణా, గుంటూరు జిల్లాల నుండి భారీఎత్తున ప్రజలు తరలిరావాలని టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయవాడలో రేపు 12గంటలకు నిరసన దీక్ష ప్రారంభమవుతుందని... ఆలోపు ప్రజలు, భవన  నిర్మాణ కార్మికులు దీక్షాస్థలికి చేరుకోవాలని కోరారు.

కృష్ణా, గుంటూరు జిల్లా మండల పార్టీ నాయకులతో టిడిపి అధ్యక్షులు చంద్రబాబు టెలికాన్ఫరెన్స్   నిర్వహించారు. స్వచ్చందంగా ప్రజలు దీక్షకు మద్దతిస్తున్నారని...వారు దీక్షాస్థలికి చేరుకునేలా చూడాలని నాయకులకు ఆయన  సూచించారు. ఈ రెండు జిల్లాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చి దీక్షను సక్సెస్ చేయాలని కోరారు.

 ఇసుక కృత్రిమ కొరతను వైసిపి నేతలే సృష్టించారని, శాండ్ మాఫియాగా ఏర్పడి  రాష్ట్రంలోని ఇసుక మొత్తాన్ని దోపిడి చేస్తున్నారని ఆరోపించారు. ఇలా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర అభివృద్దిని అడ్డుకున్నారని... రాష్ట్రానికి ఇంత నష్టం, ప్రజలకు ఇంత కష్టం ఎప్పుడూ కలగలేదని ఆవేధన వ్యక్తం చేశారు. 

read more   తెలుగు బాషాభివృద్దికి ప్రత్యేక కమిటీ... ఛైర్మన్ గా అహ్మద్ షరీఫ్

 కేవలం 5నెలల్లో 50మంది కార్మికుల ఆత్మహత్యలు రాష్ట్ర చరిత్రలో లేవన్నారు. పనుల్లేక ఎన్నో కుటుంబాలు పస్తులు ఉంటున్నాయని, అనేకమంది అప్పుల పాలయ్యారని, ఇంత పెద్దఎత్తున ఆత్మహత్యాయత్నాలు గతంలో ఎన్నడూ  జరగలేవని పేర్కొన్నారు. 

ఏకంగా టార్గెట్లు పెట్టుకుని మరీ వైసిపి నేతలు రాష్ట్రాన్ని దోచేసుకుంటున్నారని, ఇసుక, సిమెంటు,మద్యం, ఇతర పనులు అన్నింటిలో దోపిడి  జరుగుతోందని ఆరోపించారు. 
వ్యాపారాలు చేయాలంటే, ఆస్తులు అమ్మాలంటే ‘జె ట్యాక్స్’ కట్టాల్సి వస్తోందన్నారు.

కార్మికుల కష్టాల్లో అందరూ అండగా ఉండాలని, కార్మికుల కుటుంబాలకు సంఘీభావంగా చూపాలని, వివిధ ప్రాంతాలనుంచి ర్యాలీగా దీక్షకు తరలిరావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కార్మికులకు సంఘీభావంగా ఎక్కడికక్కడ ర్యాలీలు జరపాలన్నారు. 

read more  ఆ ఒక్క నిర్ణయం... రూ.1.15 లక్షల కోట్ల ఆదాయానికి గండి..: జగన్ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఫైర్

అమరావతిలో స్టార్టప్ ఏరియా డెవలప్ మెంట్ నిలిపేస్తూ సింగపూర్ కన్సార్షియంతో ఎంవోయూ రద్దు చేయడం దురదృష్టకమరమని అన్నారు. ఏపి అభివృద్ధికి ఇది ఊహించని శరాఘాతంగా మిగలనుందని, రాష్ట్రానికి ఎక్కడా పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపేయడమే కాదు రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల పనులు ఆగిపోయాయన్నారు.

ప్రభుత్వ నిర్వాకాలతో రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తు అంధకారం చేస్తున్నారని,  ఇష్టానుసారం చేయడానికి ఇది నిరంకుశత్వం కాదని హెచ్చరించారు. ప్రజా కంటక పార్టీగా వైసిపి మారిందని, ప్రజల పట్ల బాధ్యతగల పార్టీ తెలుగుదేశమేనని అన్నారు.

37ఏళ్లుగా టిడిపి పేదలకు అండగా ఉంటోందన్నారు. 22ఏళ్ల అధికారంలో రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేసిందని, ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలపై పోరాడుతోందన్నారు. ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని, రాష్ట్రంలో తక్షణమే ఇసుక ఉచితంగా ఇవ్వాలన్నారు. సరిహద్దుల్లో నిఘా కట్టుదిట్టం చేయాలని,  పొరుగు రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవాలన్నారు.

పనులు కోల్పోయినవారికి నెలకు రూ.10వేలు పరిహారం ఇవ్వాలని, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 12గంటల నిరసన దీక్షలో అన్నివర్గాల ప్రజలు పాల్గొనాలని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగట్టాలని సూచించారు. 

click me!