అక్రమ సంబంధాలు, మామూళ్లు: ఆ స్టేషన్‌లో పెత్తనమంతా ఆ ముగ్గురిదే

By sivanagaprasad Kodati  |  First Published Nov 20, 2019, 12:43 PM IST

కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని పెనమలూరులోని ఓ గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు వ్యక్తుల పెత్తనం సాగుతోంది. చివరికి పర్యవేక్షణాధికారిని సైతం ఆ ముగ్గురే నడిపిస్తూ చక్రం తిప్పుతున్నారు.


కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని పెనమలూరులోని ఓ గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు వ్యక్తుల పెత్తనం సాగుతోంది. చివరికి పర్యవేక్షణాధికారిని సైతం ఆ ముగ్గురే నడిపిస్తూ చక్రం తిప్పుతున్నారు.

జూదగాళ్లతో సత్సంబంధాలు వుండటంతో వారిపై చర్యలు తీసుకోవడం లేదు. సదరు అధికారి సైతం ఆ ముగ్గురు చెప్పిందే వింటున్నారని ప్రజలు విమర్శలు గుప్తిస్తున్నారు.

Latest Videos

undefined

Also Read:video news : లంచం తీసుకున్నట్టు సంతకం పెట్టమంటూ నిరసన

తాజాగా కొద్దిరోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట తమకు రక్షణ కల్పించాల్సిందిగా స్టేషన్‌కు వచ్చారు. అయితే ఇందుకు గాను వారి నుంచి రూ.7,000 వసూలు చేశారు. అక్కడితో ఆగకుండా ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఎస్సై అసిస్టెంట్‌కు ఇవ్వాలంటూ మరో రూ.500 డబ్బులు తీసుకున్నారు.

అమాయకులు న్యాయం కోసం వెళితే కాసులు చెల్లించాల్సిందేనా.. బరితెగింపు సిబ్బందిపై చర్యలేవి అంటూ పలువురు మండిపడుతున్నారు. ఒకేవేళ ఎస్సై దృష్టికి విషయాన్ని తీసుకెళ్తే కేసులు నమోదు చేస్తామని ఆ ముగ్గురు బెదిరిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Also Read:నేను లంచం తీసుకోను: బోర్డు పెట్టిన ఏడీఈ

కాగా విజయవాడ నుంచి రోజువారీ విధులకు వస్తున్న హోంగార్డు పెనమలూరుకు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన మహిళా ఏఎన్‌ఎంతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వీరి బాగోతాలతో పోలీస్ స్టేషన్ పరువు గంగపాలవుతోంది. సదరు స్టేషన్‌లోని సిబ్బందిని బదిలీ చేయకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బాధిత ప్రజలు హెచ్చరిస్తున్నారు.

click me!