నారాయణ కాలేజీ క్యాంపస్ లో మరో దారుణం.... విద్యార్థి ఆత్మహత్య

By Arun Kumar P  |  First Published Nov 12, 2019, 4:48 PM IST

విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. గతకొంత కాలంగా తగ్గుముఖం పట్టిన కార్పోరేట్  కాలేజీ ఆత్మహత్యలు మరోసారి కలకలం సృష్టించాయి.  


కార్పోరేట్ కాలేజీ విద్యార్థుల ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యాయి. గతంలో భారీగా కొనసాగిన ఈ ఆత్మహత్యలు గతకొంత కాలంగా ఆగిపోయాయి. అయితే తాజాగా మరో విద్యార్థి ఏకంగా కాలేజీ హాస్టల్లోనే ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో చోటుచేసుకుంది.  

గొల్లపూడిలోని నారాయణ జూనియర్ కళాశాలలో గట్ల రామాంజనేయ రెడ్డి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతడు ఇంటికి దూరంగా కాలేజీ హాస్టల్లో వుంటూ  చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో ఏమయ్యిందో ఏమో గానీ అతడు ఇవాళ  కళాశాల హాస్టల్లో శవమై కనిపించాడు. 

Latest Videos

undefined

రామాంజనేయులు ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించిన తోటి విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందించారు. దీంతో వారు తల్లిదండ్రులకు సమాచారం అందించి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే  అతడు మృతిచెందాడు.

read more  రివర్స్ డిమాండ్: భార్య వెళ్లిపోయింది, ఒంటరి పురుషుడి పింఛను ఇవ్వండి

హాస్పిటల్ కు చేరుకున్న విద్యార్థి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. తమ కొడుకు ఆత్మహత్యపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  అయితే అతడి ఆత్మహత్యకు గల కారణాలేమీ బయటకు రాలేదు.

ఇటీవల కాలంలో కార్పోరేట్ కళాశాలలు విద్యార్థుల పాలిట మృత్యుగీతికలుగా మారాయి. విద్యార్థులను బావి బారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన కాలేజీలు ర్యాంకులు,డొనేషన్ల  వెంటపడి విద్యార్ధులకు తీవ్ర ఒత్తిడిలోకి నెడుతున్నాయి. ఇలాంటి ఓ కార్పోరేట్ కాలేజి ఒత్తిడిని తట్టుకోలేక ఓ కళాశాల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.
 
 కడప జిల్లా కృష్ఱాపురంలోని నారాయణ జూనియర్ కాలేజిలో చదువుతున్న పావని అనే  విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.  కళాశాల హాస్టల్ లో సీలింగ్ ప్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో కళాశాల సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు  పావని మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు.

read more  ఇంటర్ విద్యార్థినికి క్యాన్సర్: చికిత్సకు బాలకృష్ణ చేయూత

 అయితే విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు, విద్యార్థిని బందువులు భారీగా చేరుకోవడంతో  ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోస్టుమార్టం అనంతరం డెడ్ బాడీ ని నారాయణ కాలేజ్ వద్దకు తీసికెళ్ళి ఆందోళన చేయాలనుకున్న బందువులు, విద్యార్ధి సంఘాలు నిర్ణయించారు. వీరు విద్వంసానికి పాల్పడే అవకాశం వుందన్న అనుమానంతో పోలీసులు మార్గమధ్యంలో శిల్పారామం వద్ద  వారిని అడ్డుకున్నారు. దీంతో మృతదేహాన్ని అక్కడే పెట్టి విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నారు.  
 

click me!