అలా చేస్తే సీఎం చేతకానివాడని వాళ్లకూ తెలిసిపోతుంది: వైసిపి ఎంపీతో టిడిపి ఎమ్మెల్సీ

By Arun Kumar PFirst Published Nov 27, 2019, 6:35 PM IST
Highlights

టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి వైసిపి ప్రభుత్వం విరుచుపడ్డారు. ఈ ఐదు నెలల పాలనలో ప్రభుత్వం  ఆంధ్రా ప్రజలను ఎలా మోసం చేసిందో చూడండి అంటూ వెెంకన్న కొన్ని ట్వీట్లు చేశారు.  

అమరావతి: గతకొంతకాలంగా వైఎస్సార్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డిని ఉద్దేశిస్తూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బుద్దా వెంకన్న వరుస ట్వీట్లు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి విజయసాయి రెడ్డి, సీఎం జగన్ పాలనపై వెంకన్న మరోసారి ద్వజమెత్తారు. ఈ ఐదునెలల పాలనలో వైసిపి ప్రభుత్వం చేసిందేమీలేదని... ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో కూడా ప్రజలను మోసం చేస్తున్నారని వెంకన్న ఆరోపించారు. 

''మూడు వేలు పెన్షన్ చేస్తా అని 250 పెంచి వృద్ధులను మోసం చేసింది @ysjagan గారు, 45 ఏళ్లకే బీసీ,ఎస్టీ,ఎస్సి మహిళలకు పెన్షన్ అని మహిళలను దగా చేసి అవమానించింది జగన్ గారే, రైతులకు ఏడాదికి 12,500 అని ఇప్పుడు 7,500 ఇస్తూ రైతులను వంచించింది జగన్ గారే''  

''2 వేల నిరుద్యోగ భృతి ఎత్తేసింది నిరుద్యోగులను హేళన చేసింది,అన్న క్యాంటీన్ ఎత్తేసి పేద వాడి నోటి దగ్గర కూడు లాక్కున్నది జగన్ గారే అన్న విషయం మర్చిపోయారా @VSReddy_MP గారు.అన్నట్టు ఇన్సైడర్ ట్రేడింగ్ అని మళ్లీ పాత పాటే పాడుతున్నారు ఏంటి.'' 

read more  కాల్ సెంటర్ నంబర్ 14500 కాదు 43000 పెట్టాల్సింది...: బుద్దా వెంకన్న సెటైర్లు

''అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయ్యింది ఒక్క సెంటు భూమి ట్రేడింగ్ అయ్యినట్టు ఆధారాలు చూపించలేక పోయారు.ఇంకా మీరు ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ పాట పాడితే మీ ముఖ్యమంత్రి గారు చేతగాని వాడనే అనుమానం మీ పార్టీలో మరింత బలపడుతుంది సాయి రెడ్డి గారు'' అంటూ జగన్ పాలనపై విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు.  
 
అంతకుముందు ఇసుక కొరతపై కూడా ప్రభుత్వం, వైసిపి పై వెంకన్న విమర్శలు గుప్పిస్తూ ట్వీట్లు చేశారు. ''అవినీతి గురించి మాట్లాడే ముందు దోచిన 43 వేల కోట్ల ప్రజాధనం ప్రజలకు పంచి స్టేట్ మెంట్లు ఇవ్వండి. అంతే కాని అధికారులంతా అవినీతి పరులే అనే ముద్ర వేసి మీరు సచ్చీలులుగా బిల్డ్ అప్ ఇవ్వకండి @VSReddy_MP గారు''

read more  ఆయనో ఫినాయిల్ సాయి రెడ్డి .. వైసీపీ నేతపై విరుచుకుపడ్డ బుద్ధ వెంకన్న

 ''అన్నట్టు కాల్ సెంటర్ నెంబర్ తప్పు చెప్పారు ఏంటి ? మీరు కొట్టేసింది 43 వేల కోట్లు కదా, కాల్ సెంటర్ నెంబర్ 43000 అని పెడితే కరెక్ట్ గా ఉండేది.''
 
''@ysjagan గారు, మీరు కలిసి అవినీతి మీద పోరాటం చేస్తారా @VSReddy_MP గారు. ఎన్నికలకు ముందు ప్రజల చెవిలో హామీల పువ్వులు పెట్టారు. ఇప్పుడు ఏకంగా క్యాబేజీ పెట్టేస్తున్నారు గా.. '' అంటూ వరుస ట్వీట్లతో ముఖ్యమంత్రి జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిపై వెంకన్న విరుచుకుపడ్డారు. 
 

click me!