గురువారం రాజధాని అమరావతి పర్యటించనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ సీనియర్లతో సమావేశమయ్యారు.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతంలో రేపు(గురువారం) పర్యటించనున్న నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై మాజీ సీఎం, టిడిపి జాతీయాధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఉండవల్లి నివాసంలో ఈ ప్రత్యేక భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావులతో పాటు ఎమ్మెల్యేలు రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.
అమరావతి పర్యటనపై వైసిపీ నేతల వ్యాఖ్యలు, రైతులు నిరసనకు పిలుపునివ్వడం తదితర అంశాలపై వీరు చర్చిస్తున్నట్లు సమాచారం. వీటిని దృష్టిలో వుంచుకుని రేపు పర్యటన సందర్భంగా అనుసరించాల్సిన కార్యాచరణపై సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
read more అమరావతిలో చంద్రబాబు బినామీలకే భూములు:సురేష్
గురువారం అమరావతిలోని ఎమ్మెల్యేలు, ఐఎఎస్ ల క్వార్టర్స్, హైకోర్టు, సెక్రటేరియట్, సీడ్ యాక్సిస్ రోడ్ల నిర్మాణాలను చంద్రబాబు పరిశీలించనున్నారు. ఆయనతో పాటు టిడిపికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మరియు కీలక నాయకులు ఈ పర్యటనలో పాల్గొననున్నారు.
read more టాయిలెట్లు లేని సెక్రటేరియట్... నారాయణ కాలేజీల్లా బిల్డింగులు: అమరావతిపై పేర్ని నాని కామెంట్స్
ఉదయం 9 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి ఈ పర్యటన ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే కొన్ని రైతు సంఘాలు చంద్రబాబు పర్యటన ను అడ్డుకుంటామని ప్రకటించాయి.
దళిత రైతులపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు... వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.అంతేకాకుండా వైసిపి నాయకులు కూడా చంద్రబాబు అమరావతి యాత్రపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అమరావతి పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
చంద్రబాబు అమరావతిలో పర్యటనను విమర్శిస్తున్న వైసిపి నాయకులపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు. రాజధానిని 150 పశువులు నాశనం చేస్తున్నాయంటై వైసిపి ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబుపై కక్షతోనే వైసీపీ నేతలు అమరావతిని శ్మశానంతో పోలుస్తున్నారని బొండా మండిపడ్డారు.
కొడాలి నాని దున్నపోతులు, పందులు అమరావతికి వస్తున్నాయని అనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారాజధాని అమరావతిని స్మశనంతో పోల్చడం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.
టీడీపీ హయాంలో పరిపాలన భవనాలు, హైకోర్టును పూర్తిచేస్తామని బొండా స్పష్టం చేశారు. వైసిపి ప్రభుత్వం రాజధానిని స్మశానంగా మార్చాలని చూస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. మంత్రి కొడాలి నాని బూతుల మంత్రని, స్పీకర్ కూడా బూతుల స్పీకర్‌గా మారిపోయారని... వైసిపి మంత్రులు భాషను అదుపులో ఉంచుకోవాలని ఆయన హితవు పలికారు.
బూతులకు కూడా వైసిపి ప్రభుత్వం ఒక మంత్రిత్వ శాఖను పెడుతుందా అని ఉమా ప్రశ్నించారు. వైసిపి కార్యలర్తలను, కిరాయి మనుషులను తీసుకొచ్చి అమరావతిలో ఈరోజు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. రెండు లక్షల కోట్ల అవినీతి అన్న వైసిపి, రెండు లక్షల అవినీతి అయినా బయటపెట్టగలిగిందా అని ఉమా ప్రశ్నించారు.
వైసిపి చేతకానితనంతో రాష్ట్రం అధోగతి పాలవుతోందని... వైసిపి అహంకారాన్ని, అజ్ఞానాన్ని ప్రజలకు చూపించాలని టిడిపి తీసుకున్న నిర్ణయంతోనే సిఆర్డిఏలో కదలిక వచ్చిందని బొండా వెల్లడించారు.