చంద్రబాబు ఇసుక దీక్ష... ఇందిరాగాంధీ స్టేడియంలో కాకుంటే అక్కడే...: టిడిపి ఎమ్మెల్సీ

By Arun Kumar PFirst Published Nov 8, 2019, 6:41 PM IST
Highlights

ఏపి ప్రభుత్వం కృత్రిమ ఇసుక కొరతను సృష్టించి భవన నిర్మాణ కార్మికులను ఆకలి బాధకు కారణమయ్యిందని టిడిపి ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పేర్కోన్నారు.  వారి సమస్యపై పోరాడుతున్న టిడిపి నాయకులపై కూడా బెదిరింపు దోరణిని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. 

విజయవాడ: రాష్ట్రంలో దురదృష్టవంతమైన పాలన సాగుతోందని టిడిపి నాయకులు బచ్చుల అర్జునుడు  ద్వజమెత్తారు. లక్షలాది మంది కార్మికులు పొట్ట చేత పట్టుకుని జీవనం‌ సాగిస్తున్నారని...వారి ఆకలిబాధలు ఈ  ప్రభుత్వానికి, పాలకులకు కనిపించడంగా లేదన్నారు. అయినా ఇసుక కొరతను సృష్టించి బ్లాక్ లో అమ్ముకుని దోచుకుంటున్నవారికి ఇలాంటివి ఎలా కనబడతాయని విమర్శించారు. 

ఇసుక కొరత వల్ల ప్రభుత్వానికి ఇప్పటికే యాభై వేల కోట్ల ఆదాయం పడిపోయిందన్నారు. ఈ వరదలు ఒక్క ఎపిలోనే లేవని... కానీ ఇసుక కొరత మాత్రం ఇక్కడే వుండటంలో ఆంతర్యమేమిటని అన్నారు.  ఇతర రాష్ట్రాలలో ఇసుక కొరత ఎందుకు లేదో చెప్పాలని ప్రశ్నించారు. 

ప్రభుత్వ తీరుపై టిడిపి ఆందోళనలు చేసినా చలనం లేదన్నారు. చంద్రబాబు ఇసుక ఉచితంగా ఇస్తే దోచుకున్నారని అసత్యాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఆనాడు ట్రాక్టరు లోడ్ రూ. 1500 ఉంటే నేడు ఏడు వేలు వసూలు చేస్తున్నారని అన్నారు. అప్పుడు లారీ లోడ్ రూ.15వేలు వుంటే ఇప్పుడు యాభై వేలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. 

ప్లాన్ ప్రకారమే ఇసుక దోపిడీకి జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. వందల, వేల లారీల ఇసుకను ఇతర రాష్ట్రాలకు అమ్ముకున్నారని అన్నారు. ఎంత నీరున్నా నది మధ్యలోకి వెళ్లి ఇసుక తోడే విధానం ఎంతో కాలంగా అమలవుతుందన్నారు. ఆ తరహాలో ప్రభుత్వం ఎందుకు ఇసుక తీయడం లేదని ప్రశ్నించారు.

read more  తెలుగు అకాడమీతో ఇక పనేముంది...లక్ష్మీపార్వతి ఏమంటారు..: అశోక్ బాబు

 అక్రమంగా ఇసుకను తరలిస్తున్న అనేక ఇసుక లారీలు పట్టుబడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ప్రభుత్వం నేటికీ కళ్లు తెరవలేదు కాబట్టే ఈనెల 14వ తేదీన‌ చంద్రబాబు ఒకరోజు దీక్ష చేపడుతున్నారని తెలిపారు.  చనిపోయిన కార్మికులు కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 

ఇందిరాగాంధీ స్టేడియంలో చంద్రబాబు దీక్షకు అనుమతి కోరితే ప్రభుత్వం ఒత్తిడితో పోలీసులు అందుకు నిరాకరించారన్నారు. విజయవాడ పోలీసులు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదంటూ తిరస్కరిచడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా..‌ చంద్రబాబు వెనకడుగు వేసెదే లేదన్నారు.

ఈ నెల 14వ తేదీన ధర్నా చౌక్ లోనే చంద్రబాబు ఉదయం8 నుంచి  రాత్రి 8గంటల వరకు దీక్షకు కూర్చుంటారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన తీరు మార్చుకుని ప్రజలకు మేలు చేయాలని సూచించారు. కార్మికులు, ప్రజలు, వేలాదిగా తరలి‌వచ్చి దీక్షలో పాల్గొనాలని అర్జునుడు పిలుపునిచ్చారు. 

read more  జగన్ ప్రభుత్వ నిర్ణయం... తెలుగు జాతికే పొంచివున్న ప్రమాదం...: టిడిపి ఎమ్మెల్సీ

ఉడా మాజీ  ఛైర్మన్ తూమాటి ప్రేమనాథ్ మాట్లాడుతూ... ఎపిలో ఇసుక కొరతకు ప్రభుత్వం అనాలోచిత విధానాలే కారణమన్నారు. దీంతో భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన వారంతా వీధిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ కేవలం ప్రకటనలతో హడావుడి చేయడం తప్ప వాస్తవాలను గుర్తించడం లేదన్నారు. ఆయన కేవలం ఇసుక కొరత లేకుండా చేస్తేచాలు కార్మికులలే కష్టపడి తమ పొట్ట నింపుకుంటారన్నారు.

మోడీ పెద్ద నోట్ల రద్దు తో సాధించింది ఏమీ లేదని..జగన్ కూడా ఇసుక కొత్త విధానం పేరుతో దోచుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో కూడా వైసిపి నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని...ప్రజలకు అన్నీ అర్దమవుతున్నాయి వారే ప్రభుత్వానికి బుద్ది చెబుతారని ప్రేమనాథ్ మండిపడ్డారు. 

click me!