ఇసుక కొరత... మరో మాజీ ఎమ్మెల్యే దీక్షకు పిలుపు

By Arun Kumar P  |  First Published Oct 15, 2019, 8:28 PM IST

రాష్ట్రంలొ  నెలకొన్న ఇసుక కొరతపై పోరాడేందుకు మరో మాజీ ఎమ్మెల్యే సిద్దమయ్యారు. టిడిపి మహిళ నాయకురాలు తంగిరాల సౌమ్య ఇసుక కొరతపై నిరాాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు.  


కృష్ణా జిల్లా: ఆధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్నడూలేని విధంగా ఇసుక కొరత నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో ప్రజల తరపున ప్రతిపక్ష తెలుగు దేశం పోరాటినికి దిగింది. ఇప్పటికే మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దీక్ష చేపట్టగా తాజాగా మరో మాజీ మహిళ ఎమ్మెల్యే కూడా అందుకు సిద్దమయ్యారు. రేపు(బుధవారం) నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు టిడిపి నాయకురాలు తంగిరాల సౌమ్య ప్రకటించారు.   

నందిగామ గాంధీ సెంటర్ లో ఉదయం నుండి సాయంత్రం వరకు దీక్ష చేపట్టనున్నట్లు ఆమె ప్రకటించారు. అక్రమ ఇసుక రవాణా మరియు టిడిపి నాయకులపై అక్రమ కేసులు బనాయింపుపై ఈ నిరాహర దీక్ష చేసపడుతున్నట్లు ఆమె తెలిపారు. ఇందులో భారీ సంఖ్యలో  భాదితులతో పాటు టిడిపి నాయకులు,కార్యకర్తలు పాలుపంచుకోవాలని సౌమ్య సూచించారు.

Latest Videos

undefined

ఇటీవలే ఇసుక కొరతపై టిడిపి నాయకులు కొల్లు రవీంద్ర దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఇది సాధారణంగా ఏర్పడిన కొరత కాదని సాక్షాత్తు ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కొరతేనని ఆరోపిస్తూ ఆయన దీక్ష చేపట్టారు.

వైసిపి నాయకుల కనుసన్నల్లో ఇసుక దందా కొనసాగుతోందని...ఈ పరిస్థితి నుండి రాష్ట్రాన్ని బయటపడేసేందుకే తాను 36 గంటల ఆమరణదీక్ష చేసినట్లు రవీంద్ర వివరించారు. తాజాగా ఇదే విషయంపై సౌమ్య దీక్షకు దిగనున్నట్లు ప్రకటించడం రాజకీయంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. 
 

click me!