మీడియాను మేనేజ్ చేయడానికే ఆ తాయిలాలు ఇచ్చారా?

By narsimha lodeFirst Published Oct 11, 2019, 5:11 PM IST
Highlights

విజయవాడ దుర్గమ్మ గుడిలో మరో వివాదం రాజుకుంది. పలువురు మీడియా ప్రతినిధులకు  దుర్గ గుడి అధికారులు చీరలు పంపిణీ చేసిన విషయంపై వివాదం చెలరేగుతుంది. వందల సంఖ్యలో పాత్రికేయులు దసరా విధులు నిర్వహిస్తే పదుల సంఖ్యలో తోఫాలు ఇవ్వడం పై సర్వత్ర నిరసన వ్యక్తం అవుతోంది.

విజయవాడ దుర్గమ్మ గుడిలో మరో వివాదం రాజుకుంది. పలువురు మీడియా ప్రతినిధులకు దుర్గగుడి అధికారులు చీరలు పంపిణీ చేసిన విషయంపై వివాదం చెలరేగుతుంది. దసరా ఉత్సవాలను కవరేజి చేసిన పలువురు మీడియా ప్రతినిధులకు  దుర్గ గుడి అధికారులు చేశారు.

ప్రస్తుతం ఈ విషయం  విమర్శలకు తావిస్తోంది . చీరల పంపిణీ కి దసరా ఉత్సవాలలో బడ్జెట్ ఎంత కేటాయించారు. దేనిని ప్రామాణికంగా తీసుకుని చీరలు పంపిణీ చేశారు అనే అంశంపై పలువురు చర్చించుకుంటున్నారు.

అయితే  ప్రభుత్వ కార్యక్రమం కవరేజ్ చేసినందుకు తోఫాలు ఎందుకు ఇవ్వాలి...తోఫాలు కొందరికే ఇవ్వడం లో అంతర్యం సంగతి అట్ల ఉంచితే జర్నలిస్టుల మధ్య అంతరాలు,విభేదాలు సృష్టించడానికే అన్నట్లుగా ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు...

వందల సంఖ్యలో పాత్రికేయులు దసరా విధులు నిర్వహిస్తే పదుల సంఖ్యలో తోఫాలు ఇవ్వడం పై సర్వత్ర నిరసన వ్యక్తం అవుతోంది. మీడియాని మేనేజ్ చేయడానికి ఈ తోఫా తతంగం అధికారులు నిర్వహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.ఈ అంశంపై దేవాదాయ,ధర్మాదాయ శాఖ జోక్యం చేసుకుని వాస్తవాలు వెల్లడంచాలని  పాత్రికేయులు డిమాండ్ చేస్తున్నారు.

దుర్గ గుడి అదికారులు నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటునే  ఉన్నారు. గతంలో దుర్గ గుడిలో జరిగిన తాంత్రిక పూజల వ్యవహారం. అమ్మ వారి చీర మాయం అవడం వంటి పలు వివాదాలు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా  చర్చనీయాంశమయ్యాయి. తాజా వివాదంతో మరోసారి  దుర్గ అధికారులు తీరు పలు విమర్శలు తావిస్తోంది.  ఈ విమర్శలపపై అధికారులు 
ఎలాంటి సమాధానం అనేది వేచి చూడాలి. 

click me!