మాకు రావాల్సింది మాకు ఇవ్వండి.. లేకపోతే

By narsimha lode  |  First Published Oct 11, 2019, 12:22 PM IST

భూ వివాదంలో తమకు రావలసిన పైకం గ్రామ పెద్దల దగ్గర పెట్టుకుని తమకు ఇవ్వటం లేదని చిలకపాటి వాసుదేవరావు ,లక్ష్మి అనే వృద్ధ దంపతులు గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంకు పై   ఎక్కిన  నిరసన తెలుపుతున్నారు.


 కృష్ణాజిల్లా:  ముసునూరు మండలం కాట్రేనిపాడు శివారు గ్రామం హరిచంద్ర పురం లో చిలకపాటి వాసుదేవరావు ,లక్ష్మి అనే వృద్ధ దంపతులు గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంకు పై   ఎక్కిన  నిరసన తెలుపుతున్నారు.

భూ వివాదంలో తమకు రావలసిన పైకం గ్రామ పెద్దల దగ్గర పెట్టుకుని తమకు ఇవ్వటం లేదని  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఎవరైనా తమను దింపటానికి   ప్రయత్నిస్తే పెట్రోల్ తో తగులబెట్టకుంటమని  హెచ్చరించారు. దింతో సమాచారం  అందుకున్న ముసునూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని  వారికీ  సర్ది చెప్పి దింపడానికి  ప్రయత్నిస్తున్నారు 

Latest Videos

వివరాల్లోకి వెళ్తే..  భూమి అమ్ముతామని చెప్పి  గ్రామానికి చెందిన కొందరు పెద్దలు  వాసుదేవరావు, లక్ష్మీ అనే  వృద్ధ దంపతుల నుంచి  డబ్బులు  తీసుకున్నారు. రోజులు గడుస్తున్న స్థలం రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో   మనస్తాపం చెందిన ఆ  దంపతులు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నంకు యత్నించబోయారు. ఈ  విషయం తెలుసుకున్న అధికారులు  పోలీసులు వాసుదేవరావు, లక్ష్మీలతో మాట్లాడి  భూమి రిజిస్ట్రేషన్‌పై చేయిస్తామని హామీ  ఇచ్చి వారిని కిందికి దించారు.

click me!