ఉద్రిక్తత: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సహా టీడీపీ నేతల హౌస్ అరెస్ట్

By narsimha lode  |  First Published Oct 11, 2019, 11:45 AM IST

ఇసుక కొరత విషయమై టీడీపీ , వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కృష్ణా జిల్లా మచిలీపట్టణంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో పాటు పలువురు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు


మచిలీపట్టణం: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర 36 గంటల నిరవధిక దీక్ష నేపథ్యంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కొల్లు రవీంద్రతో పాటు మరికొందరు టీడీపీ నేతలను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు.

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటికి పోలీసులు శుక్రవారం నాడు భారీగా చేరుకొన్నారు.ఇసుక కొరతను నిరసిస్తూ కొల్లు రవీంద్ర దీక్షకు దిగుతానని ప్రకటించారు. కొల్లు రవీంద్ర దీక్షకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు కూడ ధర్నాకు పిలుపునిచ్చారు.

Latest Videos

ఈ తరుణంలో రెండు పార్టీల ఆందోళనలకు అనుమతులు లేవని పోలీసులు ప్రకటించారు. భారీగా పోలీసులను మోహరించారు.  మచిలీపట్నంలోకి రాకుండా టీడీపీ నేతలను పోలీసులు ముందుజాగ్రత్తగా హౌస్ అరెస్ట్ చేశారు.

కోనేరు సెంటర్‌లో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర 36 గంటల పాటు నిరసన దీక్షకు పిలుపుఇచ్చిన విషయం తెలిసిందే.  మచిలీపట్నంలో ఎస్పీ మోకా సత్తిబాబు పరిస్థితులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, మచిలీపట్టణం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావుతో పాటు పలువురు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. జిల్లాలోని ఇతర టీడీపీ నేతలను మచిలీపట్నానికి రాకుండా అడ్డుకొన్నారు.

click me!