Pic Of The Day: నందమూరి బాలయ్యే కాదు, ఆయన సంతకమూ స్పెషలే

Published : Dec 05, 2019, 05:23 PM ISTUpdated : Dec 05, 2019, 09:37 PM IST
Pic Of The Day: నందమూరి బాలయ్యే కాదు, ఆయన సంతకమూ స్పెషలే

సారాంశం

నందమూరి బాలయ్య... సినీ ఇండస్ట్రీలోనే కాదు రాజకీయాల్లోనూ తనకంటూ ఓ స్పెషల్ దారిని, గుర్తింపును ఏర్పాటుచేసుకున్న వ్యక్తి. అయితే తాజాగా కేవలం అతడే కాదు ఆయన సంతకమూ చాలా స్పెషల్ అన్న విషయం బయటపడింది. 

విజయవాడ: రాజధాని అమరావతిపై తెలుగు దేశం పార్టీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీనీనటులు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం పూర్తయ్యేవరకు బాలకృష్ణ అక్కడే వుండి రాజధానిపై జరిగిన చర్చల్లో పాల్గొన్నారు.

 

అనంతరం అమరావతి నిర్మాణానికి మద్దతుగా చేపట్టిన సంతకాల సేకరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంతకాలకోసం ఏర్పాటుచేసిన బోర్డుపై ఆయన కూడా సంతకం చేశారు. కాస్త విచిత్రంగా వున్న ఆయన సంతకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  కేవలం ఆయన సంతకాన్ని చూడటానికి సమావేశానికి  హాజరైన వారు బోర్డు వద్ద గుమిగూడారు.

కేవలం బాలయ్యే కాదు ఆయన సంతకం కూడా స్పెషల్ గానే వుంటుందని అభిమానులు అంటున్నారు. తమ అభిమాన నటుడు ఏం చేసినా అందులో తన మార్కును ప్రదర్శిస్తాడని... సంతకంలోనూ అదే ఉట్టిపడుతోందని అభిమానులు అంటున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి వారం రోజులు సెల‌వులు.. ఎప్పటి నుంచి ఎప్ప‌టివ‌ర‌కు అంటే..?
హెచ్‌ఐవీ రోగుల సంఖ్యలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌