40ఏళ్ల రాజకీయ అనుభవం...చంద్రబాబుపై మేం దాడి చేయిస్తామా...: పోలీస్ అధికారుల సంఘం

Published : Nov 30, 2019, 03:18 PM IST
40ఏళ్ల రాజకీయ అనుభవం...చంద్రబాబుపై మేం దాడి చేయిస్తామా...: పోలీస్ అధికారుల సంఘం

సారాంశం

మాజీ సీఎం చంద్రబాబు అమరావతి పర్యటన సందర్బంగా ఆయన వాహనంపై రాళ్లు, చెప్పులతో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడికి పోలీసులే కారణమంటూ టిడిపి నాయకులు ఆరోపించడంపై ఏపి పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ స్పందించారు.   

విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అమరావతి సందర్శన సమయంలో ఆయన వాహనంపై చెప్పులు, రాళ్లు విసిరింది  నిరసనకారులేనని పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పిందని... అలాంటి పోలీసులపైనే టిడిపి నాయకులు నిందలు మోపడం తగదని సూచించారు. 

రాజధాని అమరావతిలో చంద్రబాబు పర్యటనను అడ్డుకున్న నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అన్నారు. వీటన్నింటిని గమనించకుండానే తెలుగు దేశం నాయకులు పోలీసులే దగ్గరుండి చెప్పులు ,రాళ్లు వేయించారని ఆరోయించడం తగదన్నారు. ఏకంగా రాష్ట్ర డిజిపి పైనే ఆరోపణలు చేయడం ఎంత వరకు సబబు? అని ప్రశ్నించారు.

read more జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన అమలుకు రంగం సిద్దం... మార్గదర్శకాలివే

తమ పర్యటనకు అనుమతివ్వకపోతే వాక్ స్వాతంత్య్రం అడ్డుకుంటున్నారని మాట్లాడుతున్నారని... అనుమతిచ్చాక ఇలాంటి సంఘటనలు జరిగినా తమనే నిందిస్తున్నారని అన్నారు. ఏ చిన్న అవాంఛనీయ ఘటనలు జరిగినా దాన్ని పోలీస్ లపై ఆపాదించడం శోచనీయమన్నారు. పదే పదే పోలీస్ లపై ఇలాంటి ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. 

పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేయాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం అయితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం, ప్రజాదరణ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రిపై మేము దాడి చేయిస్తామా ? అని శ్రీనివాస్ టిడిపి నాయకులనే ప్రశ్నించారు. 

read more  జగన్ పాలనపై చెప్పుకోడానికేం లేదు...చెప్పు తీసుకుని కొట్టుకోడం తప్ప: అనురాధ

ఇక పోలీస్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి మస్తాన్ మాట్లాడుతూ...పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయాలని చూస్తే సహించబోమన్నారు. పోలీసులు ఏ పార్టీకి కొమ్ముకాయకుండా నిస్పక్షపాతంగా తమ విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు. 

  

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి వారం రోజులు సెల‌వులు.. ఎప్పటి నుంచి ఎప్ప‌టివ‌ర‌కు అంటే..?
హెచ్‌ఐవీ రోగుల సంఖ్యలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌