''దారుణం... దిశ పోలీస్ స్టేషన్ సిబ్బంది చేతిలోనే యువతి అత్యాచారం..''

By Arun Kumar PFirst Published Mar 8, 2020, 2:46 PM IST
Highlights

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని  రాష్ట్రంలోని మహిళల సమస్యలు, వారిపై జరుగుతున్న అఘాయిత్యాలపై ముఖ్యమంత్రి జగన్ ను ప్రశ్నించారు టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ. 

గుంటూరు: మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ. మహిళా భద్రత కోసమంటూ దిశ చట్టాన్ని తీసుకువచ్చి దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారని... అయితే ఈ పోలీస్ స్టేషన్ లో పనిచేసే సిబ్బందే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిని దారుణం ఇటీవల బయటపడిందని గుర్తుచేశారు. దీనిపై ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని అనురాధ నిలదీశారు.

దిశ పీఎస్‌లో పనిచేసే హోంగార్డు ఫణీంద్ర ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడని... అయితే అతడిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని అన్నారు. మహిళల్ని కాపాడటానికి ఏర్పాటుచేసిన పోలీస్ స్టేషన్లో పనిచేసే అతడే ఇంత దారుణానికి పాల్పడితే కనీస విచారణ కూడా జరపలేదని అనురాధ మండిపడ్డారు. ఇదేనా మీరు మహిళలకు అందించే రక్షణ అంటూ నిలదీశారు.

read more   ప్రమోషన్ల కోసమేనా..?: అవినాష్ ఆత్మహత్యాయత్నంపై అనురాధ సూటిప్రశ్న

దిశ చట్టం వచ్చిన తర్వాత కూడా రాష్ట్రవ్యాప్తంగా అనేక అత్యాచార ఘటనలు జరిగాయని... కానీ ఒక్క నిందితుడికి కూడా దిశ చట్టం ప్రకారం శిక్ష పడలేదన్నారు. అయినా సొంత చెల్లెలు సునీత కు న్యాయం చేయలేని జగన్ ఇతర మహిళలకు న్యాయం చేస్తాడని అనుకోవడం కూడా దండగని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రాజధాని మహిళలపై అనేక  కేసులు పెట్టి వేదిస్తున్నారని ఆరోపించారు. 

''ఒక బీసీ మ‌హిళ‌నైన న‌న్ను, నాలాంటి ఎంద‌రో ఆడ‌ప‌డుచుల్ని అస‌భ్య‌ప‌ద‌జాలంతో దూషిస్తూ కించ‌ప‌రుస్తున్న వైకాపా నాయ‌కులు, వైకాపా సోష‌ల్ మీడియా పేటీఎం గ్యాంగుల‌కు అంకిత‌మిచ్చేందుకా జ‌గ‌న‌న్న మ‌హిళా దినోత్స‌వం అని పేరుపెట్టుకుని మ‌రీ జ‌రుపుతున్నారు'' అంటూ అనురాధ ట్వీట్ చేశారు. 

read  more   నాకు ఆ పెళ్లి వద్దు: ఉరేసుకుని లేడీ ఫిజియోథెరపిస్ట్ ఆత్మహత్య


 

click me!