విజయవాడ పోలీస్ కమీషనర్ ను గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలిశారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై కమీషనర్ కు వంశీ ఫిర్యాదుచేశారు.
విజయవాడ: తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం విజయవాడ పోలీస్ కమిషనర్ ని కలిసిని ఆయన ఈ విషయంపై ఫిర్యాదు చేశారు.
తాను అమ్మాయిలతో కలిసివున్నట్లు మార్పింగ్ ఫోటోలను జతచేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని...ఇలా తన ప్రతిష్టను దెబ్బతీస్తూ వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారాన్ని చేస్తున్న, చేయిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ప్రచారం వెంటనే ఆగేలా చూడాలని వంశీ కమీషనర్ ను కోరారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన వెబ్ సైట్ల నుండి ఈ దుష్ప్రచారం జరుగుతోందని.... అసలు దోషులను శిక్షించాలని పోలీస్ కమిషనర్ ను కోరారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని పోలీస్ కమిషనర్ కు అందజేసిన వంశీ వెల్లడించారు.
read more హీటెక్కిన ఏపీ రాజకీయం: ఎమ్మెల్యే వంశీపై టీడీపీ నేతలు ఫిర్యాదు
తనపై ఆరోపణలు విమర్శలు చేస్తున్న టిడిపి నేతల బతుకు ఏంటో అందరికీ తెలుసని ఈ సందర్భంగా వంశీ మరోసారి ఫైర్ అయ్యారు. దిష్టిబొమ్మను దగ్ధం చేసిన మాత్రాన నా ఇమేజ్ ఏమీ తగ్గదని... ఎన్నికల సమయాల్లో సూట్కేసులు కొట్టేసేవారు తనపై ఆరోపణలు చేస్తే వారి బండారం అంతా బయట పెడతా వంశీ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
కృష్ణా జిల్లా రాజకీయాలు విమర్శలు, ప్రతివిమర్శలతో హాట్ హాట్ గా మారి చివరకు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాయి. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అనుచరులు ఉయ్యూరు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పట్ల వంశీ అనుచితంగా ప్రవర్తించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు సంబంధించి ఆధారాలను సైతం పోలీసులకు అందజేశారు.
అంతకుముందు ఉయ్యూరులోని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో రాజేంద్రప్రసాద్ ఇంటికి చేరుకున్నారు. వంశీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు.
read more బాబుపై తీవ్ర వ్యాఖ్యలు: టీడీపీ నుండి వల్లభనేని వంశీ సస్పెన్షన్
అయితే కొంతమంది టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరడంతో ఉయ్యూరు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. తాజాగా వంశీ కూడా పోలీసులను ఆశ్రయించడం విజయవాడ రాజకీలను మరింత హీటెక్కించింది.
ఇకపోతే ఒక ప్రముఖ ఛానెల్ డిబేట్ లో టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ల మధ్య మాటల యుద్ధం జరిగింది. రాజేంద్రప్రసాద్ పై వంశీ అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రజలు వీక్షిస్తున్నారన్న విషయం కూడా మరచిపోయి ఒక్కసారిగా అసహనానికి గురయ్యారు. రాయడానికి వీల్లేని విధంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు వల్లభనేని వంశీ. పగులుద్దీ అంటూ కూడా హెచ్చరించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు సోషల్ మీడియాలో వంశీ, రాజేంద్రప్రసాద్ ల మధ్య జరిగిన సంభాషణే హాట్ హల్ చల్ చేస్తోంది. వంశీ వాడిన అసభ్య పదజాలంపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయ్యప్పమాలలో ఉంటూ ఇలా మాట్లాడతారా అంటూ పెదవి విరుస్తున్నారు.