70 ఏళ్ల వయసులో చంద్రబాబు పోరాటం...అందుకే మా మద్దతు: రాపాక

By Arun Kumar PFirst Published Nov 14, 2019, 8:35 PM IST
Highlights

వయస్సు మీదపడినప్పటికి ప్రజా సంక్షేమం కోసం పోరాడుతున్నారని టిడిపి అధినేత చంద్రబాబు దీక్షపై జనసేన ప్రశంసలు కురిపించింది. ఆ పార్టీ తరపున ఎమ్మెల్యే రాపాక మాట్లాడుతూ చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు.  

విజయవాడ: రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత మూలంగా భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి దిక్కుతోచక ప్రాణాలను బలితీసుకుంటున్నారని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి నిరుపేదల కోసం 70ఏళ్ల వయసులోనూ చంద్రబాబు దీక్షకు దిగడం గొప్ప విషయమని... ఆయన పోరాట పటిమలో నిజాయితీ వుండటం వల్లే జనసేన మద్దతిచ్చినట్లు తెలిపారు. 

ఇసుక కొరతపై  విజయవాడలో ఒకరోజు నిరాహారదీక్షకు దిగిన చంద్రబాబుకు జనసేన తరపున రాపాక వరప్రసాద్, శివశంకర్  సంఘీభావం తెలిపారు.  ఈ మేరకు పార్టీ తరపున ఓ సందేశాన్ని వీరు తెలిపారు. ఈ సందర్భంగా రాపాక మాట్లాడుతూ.... ఇసుక కొరతను ఏదో సంస్థపైన నెట్టు జగన్ తప్పించుకోవాలని చూస్తున్నారన్నారు.

 ప్రజల సమస్య ఏదైనాగానీ ఇతరులతో కల్సి పోరాడటానికి జనసేన సిద్దంగా వుంటుందని పేర్కొన్నారు. లాంగ్ మార్చ్ కి మద్దతు  ఇవ్వమని చంద్రబాబును కోరగా తమ పార్టీ నాయకులు అచ్చన్నాయుడు, అయ్యన్నపాత్రుడిని పంపినందుకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. 

read more  video: బడుల్లో ఇంగ్లీష్ మీడియం... కన్నాతో విభేదించిన విష్ణుకుమార్ రాజు

''ఇసుకపై ఎన్నో రంగాలు ఆధారపడ్డాయి...ర్యాంపుల వద్ద కొందరు వసూళ్ళకు పాల్పడుతున్నారని  వారిపై మీరేం చర్యలు తీసుకుంటున్నారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోకపోవడం దారుణం'' అని అన్నారు. 

''ఇసుక కొత్త పాలసీ తీసుకురావడానికి నాలుగు నెలలు పడుతుందా... ప్రజల ఆరోగ్యానికి హానికరమైన మద్యం పాలసీని మాత్రం అనుకున్న సమయానికే ఎలా తీసుకువచ్చారు. ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం పట్టించుకోవడం లేదు...కేవలం ఆదాయంపైనే దృష్టిపెట్టింది. ఇదే ధోరణి కొనసాగితే ప్రజలంతా ఎదురు తిరుగుతారని'' రాపాక హెచ్చరించారు.

''భవన నిర్మాణ కష్టాలు అందరికీ తెలుసు. పరిపాలన దక్షత లేని వ్యక్తి పరిపాలిస్తున్నాడని మనకు అర్థమవుతోంది. చంద్రబాబుకు అనుభవం ఉంది,జగన్ కు లేదు.. అందుకే ఈ కష్టాలు '' అని పేర్కొన్నారు.

 read more టిడిపిని వీడకూడదనే అనుకున్నా... కానీ వారివల్లే...: దేవినేని అవినాశ్

 వైసీపీ నేతలు ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారని... ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని... ఎన్నుకున్న ప్రజలను జగన్ రోడ్డున పడేశారని మండిపడ్డారు. 

పనులు లేక కార్మికులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లి చూడాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని.... అమరావతి కూడా ఆగిపోయిందన్నారు. ఇటీవల చేపట్టిన వాలంటీర్ల నియామకంలో అందరూ వైసిపి కార్యకర్తలే వున్నారని...అందుకు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. 
 

click me!