చంద్రబాబు నమ్ముకుంటే ఎవరి సంక వారు నాక్కున్నట్టే: కొడాలి నాని

By Arun Kumar PFirst Published Dec 4, 2019, 9:57 PM IST
Highlights

విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అవినాష్ ఆద్వర్యంలో వైసీపీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మంత్రి కొడాలి నాని మరోసారి టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడిపై ఘాటైన మాటలతో విమర్శించారు. 

విజయవాడ: గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్దిగా పోటీచేసినా ఏదీ మనసులో పెట్టుకోకుండా నాకు సహకరించిన మంత్రి కొడాలి నానికి దేవినేని అవినాష్ ధన్యవాదాలు తెలిపారు. నాని ఒక అన్నలాగా నాకు తోడుగా ఉన్నారని... పార్టీలో చేరడానికి సహకరించారని అన్నారు. అలాగే టిటిడి ఛైర్మన్ వై విసుబ్బారెడ్డికి కూడా అవినాష్ ధన్యవాదాలు తెలిపారు. 

విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అవినాష్ ఆద్వర్యంలో వైసీపీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఇందులో మంత్రులతో పాటు వైసీపీ నాయకులు, దేవినేని నెహ్రూ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ... 40ఏళ్ళుగా తోడున్న ప్రతి కార్యకర్తకు, నాయకులకు అందరికి అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. 

మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ....అవినాష్ మంచి నిర్ణయం తీసుకుని వైసిపిలో చేరారని అన్నారు. తండ్రిని మించిన తవయుడిగా రాజకీయాలలో ఎదగాలని కోరుకుంటున్నానని అన్నారు. 

read more  ఛాన్స్ కొట్టేశారు: వైసీపీలో భారీగా నామినేటెడ్ పదవులు

మంచి మనసున్న నాయకుడు సిఎం జగన్ అని... సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళితే చిత్తశుద్దితో పనిచేస్తాడని పొగిడాడు. గతంలో తాను చంద్రబాబు దగ్గర పనిచేశాను కాని ఆయనను నమ్ముకుంటే మన సంక మనం నాక్కున్నట్టేనంటూ సంచలన కామెంట్స్ చేశారు. 

అవినాష్ తనపై పోటీ చేసినప్పుడే చంద్రబాబును నమ్ముకుని మోసపోతున్నావని చెప్పానని గుర్తుచేశారు. చంద్రబాబును తిట్టిన వారిలో మొదటి స్దానం దేవినేని రాజశేఖర్ అయితే తరువాతి స్దానంలో నేనుంటానని అన్నారు. 

read more  అప్పుడు వద్దని ఇప్పుడు వెంపర్లాడతారా, మేం సిద్ధంగా లేం : పవన్ కు బీజేపీ స్ట్రాంగ్ వార్నింగ్

చంద్రబాబు తనకు అవినాష్ కి మద్య పోటీ పెట్టి అతన్ని దెబ్బకొట్టాలని చూశాడన్నారు. నెహ్రూ అప్పట్లో ఎన్టీఆర్ పక్షాన ఉన్నాడని మనసులో పెట్టుకుని కావాలనే అవినాష్ ని గుడివాడలో పోటీ పెట్టాడని... పిల్లాడిని మోసం చేసొన అపఖ్యాతి చంద్రబాబుదేనని అన్నారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో  కులాల వారీగా, మతాల వారీగా విడగొట్టాలనే ప్రయత్నం జరుగుతోందన్నారు. పవన్ నాయుడు పార్టీని బిజేపిలో విలీనం చేయాలనుకుంటే చేసేయాలని తమకేమి అభ్యంతరం లేదన్నారు. కానీ తానొక్కడినే హిందూ మతానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా పవన్ నాయుడు మాట్లాడుతున్నాడని... అతడితో పాటే అనేకమంది వైసిపి పై కుయుక్తులు పన్నుతున్నారని  కొడాలి నాని ఆరోపించారు. 

click me!