కృష్ణా జిల్లాలో క్షుద్రపూజల కలకలం: రోడ్డుపై ముగ్గులు, నిమ్మకాయలు

By Siva Kodati  |  First Published Dec 4, 2019, 1:40 PM IST

ఆంధ్రప్రదశ్‌లో వరుస క్షుద్రపూజల సంఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా కృష్ణాజిల్లా నందిగామ మండలం అనాసాగారం వద్ద క్షుద్రపూజలు సంచలనం సృష్టించాయి. 


ఆంధ్రప్రదశ్‌లో వరుస క్షుద్రపూజల సంఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా కృష్ణాజిల్లా నందిగామ మండలం అనాసాగారం వద్ద క్షుద్రపూజలు సంచలనం సృష్టించాయి. మంగళవారం అర్థరాత్రి అనాసాగరం-హనుమంతుపాలెం రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించారు.

గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలను సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం శ్రీకాళహస్తి సమీపంలోని కాలభైరవ ఆలయంలో క్షుద్రపూజలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగిన సంగతి తెలిసిందే.

Latest Videos

undefined

Also Read:కాకినాడలో క్షుద్రపూజలు: అర్ధరాత్రి అరుపులు.. ఉలిక్కిపడ్డ జనం

శ్రీకాళహస్తి సమీపంలోని వేడం కాలభైరవ ఆలయంలో గత మంగళవారం అర్థరాత్రి క్షుద్రపూజలు జరిగాయి. గ్రామస్తుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు తమిళనాడుకు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశారు.

వారు ఇచ్చిన సమాచారంతో శ్రీకాళహస్తి దేవస్థానం ఏఈవో ధన్‌పాల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఆలయ సెక్యూరిటీ గార్డుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ సంఘటనపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.

Also Read:క్షుద్రపూజల కలకలం: స్పందించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

click me!