నేను విన్నాను - నేను ఉన్నాను: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావ్

By Prashanth M  |  First Published Nov 18, 2019, 5:31 PM IST

వైఎస్ఆర్సిపి  ప్రభుత్వం నగర అభివృద్ధిపై చిత్తశుద్ధితో పని చేస్తుందని, టిడిపి పాలనలో ప్రచారం పైన ఉన్నా శ్రద్ధ పాలనపై లేదని  మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. సోమవారం నగర పాలక సంస్థ అధికారులు తో కలిసి నగరంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు  పలు ప్రాంతాల్లో పర్యటించారు . 


స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.. పలు ప్రాంతాల్లోని ప్రజలతో కలిసి వారి సమస్యలు, ప్రజలకు నగర అభివృద్ధిపై ఉన్న అంచనాలు.. అందుకు అనుగుణంగా అభివృద్ధికి కావలసిన అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

Latest Videos

undefined

ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల అమలులో భాగంగా వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి పనులపై దృష్టి సారించింది అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో నెహ్రూ బొమ్మ సెంటర్ నుంచి చనుమోలు వెంకట రావు ఫ్లైఓవర్ ప్రాంతం వరకు మరియు పలు ప్రాంతాల్లో బి.టి (తారు రోడ్డు) ఐదు కిలోమీటర్ల మేర నిర్మాణ పనులను అదేవిధంగా నియోజవర్గంలో దాదాపు మూడు కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్డు పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు.

 

తొలుత మంత్రి కొత్తపేట నెహ్రూ బొమ్మ సెంటర్, గణపతి రావు రోడ్డు, రాఘవరావు టు కృష్ణవేణి మార్కెట్ వెనక భాగం మరియు గాంధీ బొమ్మ సెంటర్ ఖాదర్ సెంటర్ చిట్టినగర్ ప్రాంత తదితర ప్రాంతాలను పరిశీలించారు... నైజాం గేట్ చర్చి రోడ్డు, గాంధీ హిల్ చుట్టుపక్కల ఉన్న డ్రైన్ లను కూడా త్వరలో నిర్మాణ పనులు చేపడతామన్నారు.. అదేవిధంగా నియోజవర్గంలో కొండ ప్రాంతాలలో రిటైనింగ్ వాల్ నిర్మాణాలు, నూతన అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణం కూడా పనులు ప్రారంభిస్తామన్నారు. పర్యటనలో నగర పాలక సంస్థ అధికారులు, వైయస్సార్ సిపి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

read also: వైసీపీలోకి వల్లభనేని వంశీ: యార్లగడ్డ గరంగరం, జగన్ వద్దకు పంచాయతీ

click me!