విజయవాడ శివారులో కాల్పులు: యువకుడు మృతి

Published : Oct 11, 2020, 07:11 AM ISTUpdated : Oct 11, 2020, 08:34 AM IST
విజయవాడ శివారులో కాల్పులు: యువకుడు మృతి

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ శివారులో అర్థరాత్రి కాల్పుల సంఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో మహేష్ అనే యువకుడు మరణించాడు. సంఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగర శివారులో అర్థరాత్రి  కాల్పుల సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. కాల్పుల్లో ఓ యువకుడు మరణించాడు. 

మృతుడిని పోలీసు కమిషనర్ కార్యాలయంలో పనిచేసే మహిష్ గా గుర్తించారు. మరో ఇద్దరు పరారయ్యాయురు. విజయవాడ శివారులోని బైపాస్ రోడ్డులో ఉన్న ఓ బార్ సమీపంలో కాల్పుల సంఘటన చోటు చేసుకుంది. 

పథకం ప్రకారమే మహేష్ ను చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీపీ బత్తిన శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు నిందితుల కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.  రియల్ ఎస్టేట్ వివాదం ఈ హత్యకు కారణమై ఉండవచ్చునని భావిస్తున్నారు.

పథకం ప్రకారం దుండగులు మహేష్ ను హతమార్చినట్లు అర్థమవుతోంది. తొలుత బార్ వద్దకు వచ్చి చూసి వెళ్లారు. ఆ తర్వాత వచ్చి కాల్పులు జరిపి అతన్ని హతమార్చారు. మిత్రులతో కలిసి మద్యం సేవించడానికి మహేష్ బార్ కు వచ్చాడు. దుండగులు నాటు తుపాకి వాడారు. శనివారం అర్థరాత్రి ఆ ఘటన చోటు చేసుకుంది. స్కూటర్ మీద ఇద్దరు వ్యక్తులు వచ్చి కాల్పులు జరిపారు. నిందితుల కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి వారం రోజులు సెల‌వులు.. ఎప్పటి నుంచి ఎప్ప‌టివ‌ర‌కు అంటే..?
హెచ్‌ఐవీ రోగుల సంఖ్యలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌