ఘోరం... చేపలవేటకు వెళ్లి నలుగురు గల్లంతు (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Oct 04, 2020, 07:15 AM ISTUpdated : Oct 04, 2020, 07:28 AM IST
ఘోరం... చేపలవేటకు వెళ్లి నలుగురు గల్లంతు (వీడియో)

సారాంశం

పామర్రు నియోజకవర్గం రొయ్యూరులోని ఏటిపాయలో చేపట వేటకు దిగిన ఐదుగురిలో నలుగురు ప్రమాదవశాత్తు నీటమునిగి గల్లంతయ్యారు.

విజయవాడ: కృష్ణా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పామర్రు నియోజకవర్గం రొయ్యూరులోని ఏటిపాయలో చేపట వేటకు దిగిన ఐదుగురిలో నలుగురు ప్రమాదవశాత్తు నీటమునిగి గల్లంతయ్యారు. శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకోగా ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

ఐదుగురిలో ఒక వ్యక్తి ఈదుకుంటూ బయటికి వచ్చి ప్రాణాలను కాపాడుకున్నాడు. మిగతావారు  మాత్రం బయటకు రాలేకపోయారు. బయటకు వచ్చిన వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

వీడియో

"

ఇప్పటివరకు గల్లంతైన నలుగురిలో ఒక మృతదేహం లభ్యమయ్యింది. మృతుడు కోలవెన్ను వీరయ్య గా గుర్తించారు. ఇంకా జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు, ఏనుగు రంజిత్, బెజవాడ సూర్యప్రకాష్ఆచూకి తెలియాల్సి వుంది. ఈ ప్రమాదానికి గురయిన వారంతా కంకిపాడు మండలం వైకుంఠపురం వాసులుగా గుర్తించారు. 

ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనేపెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్దసారధి అక్కడకు చేరుకుని స్వయంగా సహాయక చర్యలను పరిశీలించారు. బాదిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా వుంటుందని ఆయన అన్నారు. 


 

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి వారం రోజులు సెల‌వులు.. ఎప్పటి నుంచి ఎప్ప‌టివ‌ర‌కు అంటే..?
హెచ్‌ఐవీ రోగుల సంఖ్యలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌