101ఏళ్ళ జీవితంలో జగన్ లాంటి సీఎంను చూడలేదు: యడ్లపాటి వెంకట్రావు

By Arun Kumar PFirst Published Dec 23, 2019, 3:43 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై మాజీ ఎంపీ యడ్లపాటి వెంకట్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన 101ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని అన్నారు. 

గుంటూరు: రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండేలా రాజధాని నిర్మాణం ఉండాలని మాజీ రాజ్యసభ సభ్యులు యడ్లపాటి వెంకట్రావు పేర్కొన్నారు. రాజధాని అనేది తమకోసం ఏర్పాటు చేసుకునేది కాదని...రాష్ట్ర ప్రజల సౌకర్యానికి అనుకూలంగా  ఏర్పాటుచేసుకునేదని అన్నారు. కాబట్టి అమరావతి విషయంలో ప్రతిఒక్కరు స్పందించాల్సిన అవసరం వుందన్నారు.  

అమరావతి సమస్య ఒక్క 29 గ్రామాల సమస్య కాదని... ఐదు కోట్లు ఆంద్రులు అందరి సమస్య అని అన్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా అమరావతిని జగన్ మనస్పూర్తిగా అంగీకరించారని అన్నారు.  కాని అధికారంలోని రాగానే మనసు మార్చుకున్న అతడు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను ఘోరంగా మోసం చేశాడని ఆగ్రహించాడు.

read more  రాజీనామాలకు సిద్దమే... లేదంటే:మంత్రి బుగ్గనకు అనురాధ సవాల్‌

తన 101 ఏళ్ల జీవితంలో రాజధానిని మార్చిన సీఎంను జగన్ నే చూస్తున్నానని అన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతను అసెంబ్లీ నుంచి బయటకు పంపి రాజదానిపై ప్రకటన చేయడం సిగ్గుచేటన్నారు. హైకోర్టు , అసెంబ్లీ నిర్మాణాల వల్ల అభివృద్ధి జరగదన్న విషయం కూడా సీఎం స్థాయి వ్యక్తికి తెలియకపోవడం విడ్డూరమన్నారు. 

జగన్ ఇప్పడు ప్రకటించిన రాజదానులన్నీ గతంలో వరదలకు ముంపుకు గురైనవేనని గుర్తుచేశారు. అమరావతి ప్రాంతం చరిత్రలో ఎప్పుడు ముంపుకు గురికాలేదని తెలిపారు.  ఒక్క రాజధాని నిర్మాణానికే నిధులు లేవన్న జగన్ మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. 

read more  అమరావతికి భారీగా పోలీసు బలగాల తరలింపు.... రాజధానిపై కీలక ప్రకటన

అమరావతి లో రైతులకు జరిగిన మోసాన్ని చూసి భవిష్యత్ లో ఎవ్వరూ ప్రభుత్వానికి సహకరించరని అన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి జగన్ మరోసారి తన నిర్ణయాన్ని పునరాలోచించుకుని  అందరికీ ఆమోదయోగ్యమైన ప్రకటన చేయాలని వెంకట్రావు సూచించారు. 

click me!