ప్రధానితో జగన్ భేటీ... విజయసాయికి కేంద్ర మంత్రి పదవి కోసమే...: దేవినేని ఉమ

By Arun Kumar PFirst Published Feb 13, 2020, 9:31 PM IST
Highlights

ఏపి ముఖ్యమంత్రి జగన్ డిల్లీ పర్యటన వెనుక రాష్ట్ర ప్రయోజనాలేమీ లేవని... స్వప్రయోజనాలే వున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. ముఖ్యంగా విజయసాయి రెడ్డిని కేంద్ర మంత్రిని చేయాలనే జగన్ డిల్లీకి వెళ్లారని అన్నారు. 

అమరావతి: విజయసాయికి మంత్రి పదవి ఇప్పించడానికే జగన్‌ ఢిల్లీ వెళ్లాండటూ టీడీపీ సీనియర్‌నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరావు షాకింగ్ కామెంట్స్ చేశారు. 
ముఖ్యమంత్రి ఢిల్లీవెళ్లి ప్రధానిని కలిశాక ఎందుకు కలిశాడనే వివరాలు బయటకు చెప్పకుండా తిరిగివచ్చారన్నారు. తన పార్టీకి చెందిన 22మంది ఎంపీలతో సెల్ఫీలు దిగిన  జగన్‌ తిరిగి యథావిధిగా రాష్ట్రానికి తిరిగివచ్చాడని ఉమా ఎద్దేవాచేశారు. 

తనఢిల్లీ పర్యటన  వివరాలను బహిర్గతం చేయడానికి జగన్‌ ఎందుకు భయపడుతున్నాడని... విజయసాయిరెడ్డికి మంత్రిపదవి ఇప్పించడం కోసం ఎందుకు పాకులాడుతున్నాడని దేవినేని నిలదీశారు. క్రిమినల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న వ్యక్తికి మంత్రిపదవి ఇప్పించడంకోసం జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేకహోదా, సహా ఇతర రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారని మండిపడ్డారు. విజయసాయికి కేంద్రమంత్రి పదవి ఇప్పించడానికి జగన్‌ చేస్తున్న యత్నాల్లోని లోగుట్టు ఏమిటో ఆయనే చెప్పాలన్నారు.  

నేరచరిత్ర ఉన్న రాజకీయ నాయకుల వివరాలను సోషల్‌మీడియా సహా ఇతర ప్రసారమాధ్యమాల్లో బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసిన నేపథ్యంలో విజయసాయి, జగన్‌రెడ్డి లాంటివారు తమ వివరాలను ఎప్పుడు చెబుతున్నారో స్పష్టంచేయాలన్నారు. 

ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌ రెడ్డి పదవిని చేపట్టినప్పటి నుండి పోలవరం పనులన్నీ అటకెక్కాయని...ఇప్పటికి తొమ్మిది నెలలైనా  35 వేలనుంచి 40వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్ పనులుకూడా ఈ ప్రభుత్వం చేయలేకపోయిందని  మండిపడ్డారు.  బుల్లెట్లు దింపుతానంటున్న ఇరిగేషన్‌ మంత్రి పనులగురించి మాట్లాడకుండా తప్పించుకుంటున్నాడని ఎద్దేవాచేశారు. 

read more  ఈ ఐదింటిపై అప్పుడేమన్నారు...? ఇప్పుడేం చేస్తున్నారు...?: జగన్ ను నిలదీసిన బోండా ఉమ

గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర  కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ఆర్థికశాఖ  వద్ద ఉన్న డీపీఆర్‌-2ని రాష్ట్రప్రభుత్వం ఎందుకు క్లియర్‌చేసుకోలేక పోతుందని...ల్యాండ్‌ అక్విజేషన్‌లో ఆర్‌అండ్‌ఆర్‌కి సంబంధించి ఎందుకు మాట్లాడలేకపోతోందని దేవినేని ప్రశ్నించారు. 9నెలల్లో పోలవరం పనులపై ముఖ్యమంత్రి ఒక్కరోజుకూడా సమీక్ష చేయలేదన్నారు.

పక్కరాష్ట్రంలో కాళేశ్వరంపై కోట్లు ఖర్చుచేస్తుంటే ఏపీ ప్రభుత్వంమాత్రం రూపాయి కూడా ఖర్చుచేయలేని నిస్సహాయ స్థితికి చేరిందని ఉమా మండిపడ్డారు. తెలుగుదేశం హయాంలో 58 శాతం పనులు జరిగితే వైసీపీప్రభుత్వం వచ్చాక ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా  పనులు నిలిపివేసిందన్నారు. రాష్ట్రంలో 62ప్రాజెక్టులను టీడీపీప్రభుత్వం ఆరంభించి 32కుపైగా పూర్తిచేస్తే, వైసీపీ వచ్చాక మిగిలినవాటిని రద్దుచేసిందన్నారు.

కడపలో జగన్‌ మేనమామ, ముఖ్యమంత్రికి సన్నిహితుడైన ఎంపీ చేపట్టిన ప్రాజెక్టుల పనులుతప్ప మిగిలినవన్నీ ఎందుకు నిలిచిపోయాయని దేవినేని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టులపై పెట్టని శ్రద్ధని జగన్‌ ఆరెండు ప్రాజెక్టులపైనే ఎందుకుపెట్టాడో జలవనరుల మంత్రి సమాధానం చెప్పాలన్నారు. 

పోలవరంపై టీడీపీ ప్రభుత్వం రూ.5,600కోట్లు ఖర్చు చేసిందని... అయితే జగన్‌ సర్కారు వచ్చాక ఢిల్లీ నుంచి ఎన్నినిధులురాబట్టిందో ఉత్తరకుమార ప్రగల్భాల మంత్రి స్పష్టంచేయాలన్నారు. మార్చిలో బడ్జెట్ సమావేశాలంటున్న ప్రభుత్వం గత బడ్జెట్లో కేయించిన రూ.13వేలకోట్లను గడచిన 9నెలల్లో ఏ ప్రాజెక్టుకు ఎంత ఖర్చుచేసిందో స్పష్టంచేయాలని ఉమా డిమాండ్‌చేశారు. 

గడచిన 5ఏళ్లలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రూ.73వేలకోట్లను సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చుచేయబడ్డాయని, జగన్‌సర్కారు వచ్చాక ఎన్నికోట్లు ఏఏ ప్రాజెక్టులపై ఖర్చుచేసిందో స్పష్టంచేయాలన్నారు. పోలవరం పూర్తయితే ఒక సామాజికవర్గానికి, కొంతమంది రైతులకే న్యాయం జరుగుతుందన్న భావనలో ముఖ్యమంత్రి ఉన్నట్లుగా వార్తలువస్తున్నాయని, అటువంటి ఆలోచనల్లో జగన్‌ఉంటే అంతకంటే దుర్మార్గం మరోటి ఉండబోదన్నారు. 

ఉత్తరాంధ్ర సుజలస్రవంతిని ఆపేసిన ప్రభుత్వం పైపులైన్లద్వారా గోదావరి నీటిని విశాఖకు తరలించడానికి యత్నాలు చేస్తోందన్నారు. కేవలం కమీషన్లకోసమే వైసీపీప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఉమా ఆగ్రహం  వ్యక్తంచేశారు. 

పురుషోత్తమపట్నం ద్వారా ఏలేరు రిజర్వాయర్‌కు నీటిని తరలించామని, అక్కడనుంచి విశాఖకు నీటిని తరలించే అవకాశమున్నా, శారదానదిపై కట్టిన ప్రాజెక్ట్‌ద్వారా, ఉత్తరాంధ్ర సుజలస్రవంతి ద్వారా విశాఖకు నీటినిపంపే అవకాశమున్నా జగన్‌సర్కారు ఆదిశగా ఎందుకు ఆలోచించడంలేదన్నారు. అవగాహనలేని ముఖ్యమంత్రికి ఎంతచెప్పినా తలకెక్కడంలేదన్నారు. 

read more  ఆ తీర్పు మాజీ మంత్రి పుల్లారావుకు చెంప‌పెట్టు...: ఎమ్మెల్యే విడదల రజిని

జగన్‌కు పబ్జీగేమ్‌లపై ఉన్న శ్రద్ధ, సాగునీటి ప్రాజెక్టులపై లేకపోవడం విచారకరమన్నారు.  పక్కరాష్ట్రం సాగునీటిప్రాజెక్టులను పరుగులుపెట్టిస్తుంటే, జగన్‌ మొద్దునిద్రపోతున్నాడని, ఏఏ ఏజెన్సీలకు ప్రాజెక్టుల పనులు అప్పగించాడో ఆయన సమాధానం చెప్పాలన్నారు. 9నెలల్లో ఆర్‌అండ్‌ఆర్‌ కింద ల్యాండ్‌ అక్విజేషన్‌కు ఎంత ఖర్చుచేశారో పూర్తివివరాలు వెల్లడించాలని ఉమా డిమాండ్‌  చేశారు.

ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలుచేస్తున్న అమరావతి మహిళల టెంటుబయట మద్యంబాిళ్లు విసరడంద్వారా ఉద్యమకారుల్ని రెచ్చగొట్టడానికి ప్రభుత్వం యత్నిస్తోందని మాజీ మంత్రి ఉమ ఆరోపించారు.  

 

click me!