చంపాలన్నదే తుగ్లక్ జగన్ దురాలోచన... ప్రత్యక్ష ఉద్యమానికి సిద్దం: దేవినేని ఉమ

By Arun Kumar PFirst Published Dec 20, 2019, 3:07 PM IST
Highlights

ఏసి సీఎం జగన్ పెద్ద కుట్రకు తెరతీశారని టిడిపి  సీనియర్ నాయకులు, మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. అందుకోసమే రాజధాని మార్పు పేరుతో ఉద్రిక్తత పరిస్థితులను  సృష్టిస్తున్నారని అన్నారు.

విజయవాడ: భారత ప్రధాని, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, కేంద్ర మంత్రులతో శంకుస్థాపన గావించబడిన రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటన దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే విధంగా ఉందని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపి రాజధానిపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఆయన శుక్రవారం విజయవాడలోని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 

మాట తప్పను మడమ తిప్పను అని చెప్పుకునే జగన్ గతంలో రాజధాని అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని చెప్పి నేడు మాట తప్పాడని అన్నారు. మూడు రాజధానుల విషయంలో సౌత్ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకున్న జగన్ ఆ దేశ అధ్యక్షుడు ఆదేశ పార్లమెంటులో చెప్పిన మాటలను విన్నారా అని ప్రశ్నించారు.

అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ అమరావతి వికేంద్రీకరణ చేస్తూ జగన్ చేసిన ప్రకటనతో ఏపీ తుగ్లక్ ఏమి చేస్తున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. సీఎం జగన్ నిర్ణయంపై మంత్రులకే క్లారిటీ లేదని... ఒకరు రాజధాని మార్పు ఉండొచ్చని, మరొకరు ఉండకపోవచ్చని అంటే మరొకరు సీఎం చెప్పిందే ఫైనలా అని దిక్కరించే దోరణిలో మాట్లాడారన్నారు. 

read more  జనసేన పార్టీ అమరావతి పర్యటన... ఆవేదనను వెల్లగక్కిన రాజధాని మహిళలు

ఇక మంత్రి పెద్దిరెడ్డి అయితే మరోఅడుగు ముందేకేసీ మూడు చోట్ల కాకపోతే 30 చోట్ల రాజధాని పెట్టుకుంటామని అంటున్నారు. రైతుల భూములు వెనక్కి చేస్తామంటూ ఇష్టారీతిన ప్రకటనలు చేస్తున్నారని దేవినేని దుయ్యబట్టారు.

జగన్మోహన్ రెడ్డి సూచనతో విజయసాయి రెడ్డి సారథ్యంలో వైసీపీ నేతలు ఆరు వేల ఎకరాలను విశాఖపట్నంలో కొనుగోలు చేశారని ఆరోపించారు. గత మూడు నెలల్లో జరిగిన ఈ భూ లావాదేవీలపై సిబిఐ విచారణ చెయ్యాలని డిమాండ్ చేశారు. అప్పుడు అసలైన ఇన్సైడర్ ట్రేడింగ్ బయటపడుతుందని అన్నారు.

అమరావతిలో 33 వేల ఎకరాలు రాజధానికి ఇచ్చిన చిన్న సన్నకారు రైతుల త్యాగం ఉందన్నారు. అలాంటి రైతులకు అన్యాయం జరిగి వారి ప్రయోజనాలకు భంగం కలిగితే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని దేవినేని హెచ్చరించారు.

read more  జీఎన్ రావు కమిటీ సీఎంతో భేటీ: రాజధానిపై కీలక ప్రకటన చేసే ఛాన్స్
 
అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ...అమరావతి వికేంద్రీకరణ చేసి అమరావతి ని చంపేయాలి అని జగన్ చూస్తున్నాడన్నారు. కేవలం 10 శాతం నిధులు ఖర్చు చేస్తే అమరావతి లో భవనాలు పూర్తి అయిపోతాయన్నారు. జగన్ దేశ సార్వభౌమాధికారం ప్రదర్శిస్తున్నాడని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.


  

click me!