ఏపీ టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలుగు రాష్ట్రాల సీఎంలపై ఫైరయ్యారు. విభజన చట్టం ప్రకారం నదీ జలాలను పర్యవేక్షణకు గతంలో ఎఫెక్స్ కౌన్సిల్ ఏర్పాటైందన్నారు. దీనికి కేంద్ర జలవనరులు శాఖ మంత్రి ఛైర్మన్ గా, రెండు తెలుగు రాష్ట్రాల సిఎం లు సభ్యలు గా ఉంటారన్నారు. నది జలాల అంశంపై ఉమా మీడియాతో మాట్లాడారు.
.
ఏపీ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలుగు రాష్ట్రాల సీఎంలపై ఫైరయ్యారు. విభజన చట్టం ప్రకారం నదీ జలాలను పర్యవేక్షణకు గతంలో ఎఫెక్స్ కౌన్సిల్ ఏర్పాటైందన్నారు. దీనికి కేంద్ర జలవనరులు శాఖ మంత్రి ఛైర్మన్ గా, రెండు తెలుగు రాష్ట్రాల సిఎం లు సభ్యలు గా ఉంటారన్నారు. నది జలాల అంశంపై ఉమా మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
" ఎన్ని సార్లు నది జలాల ఆంశం భేటీ అయి...ఏ అంశాల పై చర్చించారో ముఖ్యమంత్రి జగన్ చెప్పాలి. సిఎం లుగా ఏం చర్చించారో ప్రజలకు వివరణ ఇవ్వాలి బచావత్ ట్రిబ్యునల్, నీటి పంపిణీ పై ఒక్కసారి అయినా చర్చ చేశారా మీరు వీడియో గేమ్స్ ఆడుకుంటారో, నెట్ లింక్స్ లో సినిమాలు చూస్తారో మాకు అనవసరం కానీ ప్రజలు, రైతుల హక్కులు కాపాడాల్సిన బాధ్యత సిఎం గా మీ పైనే ఉంది చట్టబద్ధంగా మనకు రావాల్సిన నీటి వాటాపై .. జగన్ గారూ.. ఎందుకు మాట్లాడరు. అంటూ" విమర్శించారు
కేసిఆర్, కవిత లు పోలవరం పై కేసు వేస్తే.. మీరు ప్రశ్నించరు. గతంలో మేము ప్రతి అంశాన్ని ఎఫెక్స్ కౌన్సిల్ లో పెట్టి సమస్య పరిష్కారం కోసం కృషి చేశాం. రాయలసీమ కు నీటిని తరలించడంలో విఫలమయ్యారు గతంలోవైయస్ కూడా నిర్లక్ష్యం గా వ్యవహరించడం వల్ల కర్నాటక లో అనేక ప్రాజెక్టు లు నిర్మించేశారు ఇప్పటికైనా జగన్ స్పందించి ఎపికి అన్యాయం జరగకుండా చూడాలి కోట్ల మంది ప్రజలతో ముడి పడి ఉన్న జలాల పంపిణీ వ్యవహారం ఇది మీ ఇద్దరూ చూసుకోవడానికి మీ వ్యక్తిగత పంచాయతీ కాదన్నారు,