రౌడీ మంత్రులతో కలిసి జగన్ అసమర్ధ పాలన...రావణకాష్టంగా రాష్ట్రం: తులసి రెడ్డి

By Arun Kumar PFirst Published Dec 2, 2019, 6:25 PM IST
Highlights

ఏపిలో వైసిపి ప్రభుత్వ ఆరు నెలల పాలనపై కాంగ్రెెస్ నాయకులు తులసిరెడ్డి స్పందించారు. ఈ ఆరునెలలు రాష్ట్రంలోో రావణకాష్టం రగిలిందని ద్వజమెత్తారు.  

విజయవాడ: వైసీపీ ఆరు నెలల పాలనపై ఏపీసిసి ఉపాధ్యక్షులు తులసిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసిపి ఇంతకాలం అన్యాయ, అవినీతి, అసత్య, అసమర్థ, అరాచక, అప్పుల, ఆత్మహత్యల పాలన సాగించిందని మండిపడ్డారు. 

కేవలం ఆరు నెలల్లోనే ముఖ్యమంత్రి జగన్ ఏకంగా 28 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు... గతంలో ఏ ముఖ్యమంత్రి  కూడా ఇంత తక్కువ కాలంలో ఈ స్థాయిలో అప్పులు చేయలేదన్నారు. స్వయంగా ముఖ్యమంత్రే ప్రభుత్వ ఆస్తులు అమ్మి పాలన చేస్తామని చెప్పడం విడ్డూరంగా వుందన్నారు. 

వైసిపి పాలనలో రాష్ట్రం రావణాకాష్టంలా మారుతోందని... కొంతమంది మంత్రులు వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇసుక కృత్రిమ కొరత సృష్టించి వైసిపి నేతలు కోట్లలో అవినీతికి తెర తీసారన్నారు. 

read more  సిట్ కాదు జగన్ విచారించినా పరవాలేదు...కానీ...: అచ్చెన్నాయుడు

రైతు భరోసా పేరుతో రైతులను దగా చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. రైతులకు ఇస్తానన్నది రూ.12,500 రూపాయలు కాగా ఇస్తుంది మాత్రం రూ.7,500 రూపాయలు మాత్రమేనని ఆరోపించారు. 

ఇక ప్రత్యేక హోదా సాధించడం, విభజన హామీలను అమలు చేయడంలో కూడా ఈ ప్రభుత్వం ఘోరంగా విపలమైందన్నారు. ప్రభుత్వం దుబారా ఖర్చు ఎక్కువ చేస్తోందన్నారు. నవరత్నాలు రంగు రాళ్లు, గులక రాళ్లుగా మారాయని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. 

read more పోలీసులూ జాగ్రత్త... మీకు శిక్ష తప్పదు: చంద్రబాబు హెచ్చరిక

ఏపిలో జగన్మోహనరెడ్డి 6 నెలల పాలన మిశ్రమ రీతిలో సాగిందని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ 6 నెలలు కొందరికి మోదంగా, మరికొందరికి ఖేదంగా గడిచిందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన నవరత్నాల హామీల అమలు పూర్తిగా కాకపోయినా కొంత మేరకు జరిగాయన్నారు. అందుకోసం ప్రభుత్వం, పాలకులు కృషి చేశారని అభిప్రాయపడ్డారు.

సీఎం జగన్ తన మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయం పాటించారని అన్నారు. అధికారాన్ని చేపట్టన వెంటనే గ్రామ సచివాలయాలు, వాలంటీర్లూ అంటూ కొత్త ఉద్యోగాలను కల్పించి నిరుద్యోగ యువతకు భవిష్యత్  పై భరోసా కల్పించారన్నారు. 

అయితే మరోవైపు ప్రభుత్వ చర్యలతో ఇప్పటికే ఉన్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులలో అభద్రతాభావం నెలకొందన్నారు. ఇప్పటికే కొంతమంది ఉద్యోగాలు కోల్పోయినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని  గుర్తుచేశారు. 

ఇక ఇసుక పాలసీ అంటూ దాదాపు ఐదు నెలలపాటు ఇసుక సరఫరా ఆపివేయడంతో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని అన్నారు. దీంతో కార్మికుల ఆత్మహత్యలు చోటుచేసుకోవడంతో పాటు రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై భారం పడిందని ఆరోపించారు.

గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన అన్నా కాంటీన్ల మూసివేతతో నిరుపేదలు, దినసరి కూలీలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అధికార అండతో  వైసిపి ప్రతిపక్ష పార్టీలను ఖాతరు చేయడంలేదన్నారు.

 ప్రస్తుత కేబినెట్ లోని మంత్రులకు స్వేచ్చగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేకుండాపోయిందన్నారు.  నిర్ణయాధికారం మొత్తం సీఎం జగన్ వద్దే వుందని... మొత్తంగా ఏకపక్ష మరీ చెప్పాలంటే ఏకవ్యక్తి పాలన సాగుతోందన్నారు. ఇలా జగన్మోహన రెడ్డి ఆరు నెలల పాలన ప్రజలకు మిశ్రమ ఫలితాలనే మిగిల్చిందని రామకృష్ణ అభిప్రాయపడ్డారు.    


 

click me!