అమరావతి విషయంలో జోక్యం చేసుకుంటారా...?: కేశినేని ప్రశ్నపై కేంద్రం స్పష్టత

By Arun Kumar PFirst Published Feb 4, 2020, 7:44 PM IST
Highlights

టిడిపి ఎంపీ కేశినేని నాని అమరావతిలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణాలమాలపై కేంద్ర ఏమేరకు జోక్యం చేసుకుంటుందంటూ పార్లమెంట్ ప్రశ్నించారు. దీనిపై కేంద్ర హోంశాఖ ఆసక్తికరమైన సమాధానం చెప్పింది. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మూడు రాజధాను నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సాక్షిగా ఈ విషయంపై పోరాడేందుకు సిద్దమైంది.  రాష్ట్రంలో మరీ ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేసింది. ఇందుకోసం బడ్జెట్ సమావేశాలను ఉపయోగించుకుంటోంది. 

ఈ క్రమంలో టిడిపి ఎంపీ కేశినేని నాని అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రం ఆసక్తికరమైన సమాధానం చెప్పింది. ''ఏపి రాజధాని అమరావతిలో జరుగుతున్న ప్రజా ఆందోళనలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చాయా? ఈ విషయంలో కేంద్రం ఈ మేరకు జోక్యం చేసుకుంటుంది?'' అన్న టీడీపీ ఎంపీ ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ జవాబిచ్చింది. 

''రాజ్యాంగంలోని 7వ షెడ్యూలు ప్రకారం శాంతి భద్రతలు, పోలీసు యంత్రాంగం రాష్ట్ర పరిధిలోనే ఉంటాయి. శాంతి భద్రతల నిర్వహణ ప్రాథమిక బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే బాధ్యత కూడా రాష్ట్రాలదే. 

కేంద్ర ప్రభుత్వం కేవలం శాంతిభద్రతలను పర్యవేక్షిస్తుంది. అవసరమైతే కేంద్రం అదనపు బలగాలను పంపించి రాష్ట్రానికి సహకరిస్తుంది. ఇంత వరకు అదనపు బలగాలు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదన మాకు రాలేదు'' అంటూ కేంద్ర ప్రభుత్వం ఏపి రాజధాని విషయంలో తలదూర్చబోమంటూ సమాధానమిచ్చింది.  

read more  ఆ మంత్రులూ దద్దమ్మలేనా...? జబర్దస్త్‌ పంచులు పనిచేయవు...: రోజాకు సంధ్యారాణి చురకలు

రాజధానిని అమరావతి నుండి తరలించడంపై లోక్ సభలో గుంటూరు టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ కూడా ప్రశ్నలు లేవనెత్తారు. అయితే రాజధాని విషయంలో  సీఎం   జగన్ తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఊహించని మద్దతు లభించింది. రాజధాని విషయంలో ఎలాంటి నిర్ణయైనా రాష్ట్రాలే తీసుకుంటాయని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం లోక్ సభ సమావేశాలు జరుగుతుండగా ఆ సమావేశాల్లో కేంద్ర హోంశాఖ ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది.

గత ప్రభుత్వ హయాంలో ఏపీ రాజధానిగా అమరావతి ఉండేది. కాగా... దానిని మారుస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కూడా.. ఈ మేరకు కార్యాలయాల తరలింపు పనులు కూడా ప్రారంభించారు. ఈ మూడు రాజధానుల అంశంపై ప్రతిపక్ష టీడీపీ, బీజేపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. 

 మరోవైపు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు సైతం అమరావతి నుంచి తరలించవద్దంటూ ఆందోళణలు  చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేటి లోక్ సభలో రాజధాని తరలింపు అంశాన్ని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ లేవనెత్తారు. ఈ విషయంపై కేంద్రాన్ని ప్రశ్నించగా... కేంద్రం సంచలన ప్రకటన చేసింది.

read more  కేసీఆర్ కు జగన్ బినామీ... అందుకోసమే...: నిమ్మల సంచలన వ్యాఖ్యలు

రాజధాని అమరావతి అని ప్రకటిస్తూ హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2015లో అమరావతిని ఏపనీ రాజధానిగా నోటిఫై చేశామని కేంద్రం చెప్పింది. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని తాము మీడియా రిపోర్టులో చూశామని కేంద్ర మంత్రి చెప్పారు. రాజధాని నిర్ణయం రాష్ట్రాలకే ఉంటుందని చెప్పారు. 
 


 

click me!