కేసుల కోసం డిల్లీలో సపోర్టు... ఓట్లకోసం రాష్ట్రంలో వ్యతిరేకం...: జగన్ పై వర్ల సైటైర్లు

By Arun Kumar PFirst Published Dec 24, 2019, 10:16 PM IST
Highlights

జగన్‌ సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ బిల్‌ విషయంలో విషయంలో ద్వంద ప్రమాణాలు అవలంభించాడని వర్ల రామయ్య ఆరోపించారు. ఆ బిల్లుకు మద్ధతు తెలపాలంటూ తన పార్టీ ఎంపీలకు విప్‌జారీ చేసిన వ్యక్తి  ఇప్పుడు ఎన్‌ఆర్‌సీకి తాను వ్యతిరేకమంటూ కడప పర్యటనలో చెప్పడం రెండునాల్కల ధోరణికి నిదర్శనమన్నారు.  

మాటతప్పను, మడమతిప్పను అని చెప్పుకునే జగన్మోహన్‌రెడ్డి, కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ చట్టసవరణ బిల్లుపై ఎందుకు పిల్లిమొగ్గలు వేశాడని టీడీపీ సీనియర్‌నేత, ఆపార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు  వర్ల రామయ్య ప్రశ్నించారు. 

మంగళవారం ఆయన ఆత్మకూరులోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్‌ సీఏబీ(సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ బిల్‌) విషయంలో ద్వంద ప్రమాణాలు అవలంభించాడని ఆరోపించారు. ఆ బిల్లుకు మద్ధతు తెలపాలంటూ తన పార్టీ ఎంపీలకు విప్‌జారీ చేసిన వ్యక్తి  ఇప్పుడు ఎన్‌ఆర్‌సీకి తాను వ్యతిరేకమంటూ కడప పర్యటనలో చెప్పడం రెండునాల్కల ధోరణికి నిదర్శనమన్నారు. 

ఎన్‌ఆర్‌సీ బిల్లుని అనేక  పార్టీలు వ్యతిరేకించాయని, టీడీపీ ఎంపీ కేశినేని నాని దానిపై నిరసన కూడా వ్యక్తం  చేశాడని వర్ల తెలిపారు. జగన్‌ ప్రభుత్వంలోని అధికారి ఆర్‌పీ సిసోడియా 16 ఆగస్ట్‌ 2019న ఇచ్చిన 102జీవోలో ఒకరకమైన ఆదేశాలుంటే ముఖ్యమంత్రి మాటలు మరోలా ఉన్నాయన్నారు. కేసుల కోసం జైలుకువెళ్లకుండా ఉండటం కోసం ఢిల్లీలో తనపార్టీ ఎంపీలతో ఒకలా చేయించిన ముఖ్యమంత్రి జగన్‌ ముస్లిం ఓట్లకోసం కడపలో అబద్ధాలాడాడని వర్ల మండిపడ్డారు. 

read more  జగన్ ఏం చెప్పినా ఆ ఉత్తరాంధ్ర బఫూన్లు నమ్మేస్తారు: మాజీ విప్ రవికుమార్

దేశవ్యాప్తంగా ముస్లింలు వ్యతిరేకిస్తున్న బిల్లుకి మద్ధతు పలకడం ద్వారా జగన్మోహన్‌రెడ్డి ఆ వర్గాన్ని దారుణంగా మోసం చేశాడన్నారు. అమిత్‌షా, మోదీ కనుసన్నల్లోనే జగన్‌ భవిష్యత్‌ ఉందని, దానికోసమే  వారు చేసే పనులకు జగన్‌ వత్తాసు పలుకుతున్నాడన్నారు. వైసీపీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు సీఏబీకి ఎందుకు మద్ధతు పలికారో జగన్‌ ముస్లింలకు వివరణ ఇవ్వాలన్నారు. 

ప్రత్యేకహోదా, పీపీఏలరద్దు, ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులేయడం వంటి అనేక అంశాలపై జగన్‌ పలుమార్లు మాటతప్పి, మడమ తిప్పాడని రామయ్య ఎద్దేవా చేశారు. గాలిపటం గాలిలో వెళ్తున్నట్లుగా జగన్‌ పాలన ఉందని, ఆయన ఇప్పటికైనా తన రెండు నాల్కలధోరణి మానుకొవాలన్నారు.

read more  విశాఖ నుండి అమరావతికే... జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం

సీ.ఏ.బీకి మద్ధతివ్వడం తమ తప్పేనని ఒప్పుకోవాలని.. లిఖితపూర్వకంగా లోక్‌సభకు, రాజ్యసభకు క్షమాపణ చెప్పాలని వర్ల సూచించారు. ముస్లింల ఓట్లు కావాలనుకుంటే తప్పు జరిగిందని ఒప్పుకొని వారికి బహిరంగ క్షమాపణ చెప్పి సీ.ఏ.బీకి ఇచ్చిన మద్ధతుని ఉపసంహరించుకోవాలని వర్ల సూచించారు. 

 
 

click me!