వల్లభనేని వంశీకి మిత్రుడినైనా...: బోడె ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్ కు పలకరింపు

By telugu teamFirst Published Nov 16, 2019, 11:53 AM IST
Highlights

అలక వహించిన టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ను పార్టీ నేత బోడె ప్రసాద్ కలిశారు. రాజేంద్ర ప్రసాద్ మీద వల్లభనేని వంశీ వ్యక్తిగత దూషణలు చేయడాన్ని బోడె ప్రసాద్ ఖండించారు.

విజయవాడ: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ తీవ్ర వ్యాఖ్యలతో విజయవాడ రాజకీయం వేడెక్కింది. వల్లభనేని వంశీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై, ఆయన కుమారుడు నారా లోకేష్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ లైవ్ షోలో టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ పై తిట్ల దండకం ఎత్తుకెత్తున్నారు. 

తనకు పార్టీ మద్దతు రావడం లేదంటూ అలిగిన రాజేంద్ర ప్రసాద్ ను బుజ్జగించేందుకు టీడీపీ నాయకత్వం ముందుకు వచ్చింది. టీడీపీ నేత బోడె ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లి మాట్లాడారు. వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తాను రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లి మాట్లాడానని చెప్పారు. 

Also Read: వంశీ తిట్లు: చంద్రబాబుకు ఎదురు తిరిగిన ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

స్నేహం వేరు, రాజకీయం వేరని బోడె ప్రసాద్ అన్నారు వ్యక్తిగత దూషణలు మంచిది కాదని ఆయన ఆయన వంశీకి హితవు పలికారు. అలక వహించిన రాజేంద్ర ప్రసాద్ తో పార్టీ అగ్రనేతలు మాట్లాడి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. రాజేంద్ర ప్రసాద్ కు బోడె ప్రసాద్ డబ్బులు ఇచ్చారని వంశీ ఆరోపించారు. వంశీ ఆరోపణలను బోడె ప్రసాద్ ఖండించకపోవడంపై రాజేంద్ర ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో అధిష్టానం సూచన మేరకు బోడె ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ ను కలిశారు. 

రాజకీయ నాయకులంటేనే ఏవగింపుగా తయారయ్యారని రాజేంద్ర ప్రసాద్ తో భేటీ తర్వాత బోడె ప్రసాద్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అవకాశం ఇవ్వాలనే ప్రజలు జగన్ కు ఓటేసారని ఆయన అన్నారు. వై.వి.బి రాజేంద్రప్రసాద్ ను వ్యక్తిగతంగా దూషించడం అసమంజసమని ఆయన అన్నారు. వంశీ స్నేహితుడినయినా టిడిపి నుంచి మారబోనని ఆయన స్పష్టం చేశారు. తాను వై.వి.బి ర్యాలీ వైపు నుంచే వెళ్ళానని, వంశీకి టిడిపి భయపడటం లేదని అన్నారు.

click me!