ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కేవలం రాజధానినే కాదు రాష్ట్రం మొత్తాన్ని ముక్కలు చేసే ప్రయత్నం చేస్తున్నారని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు.
విజయవాడ: రాష్ట్రంలో అసలేం జరుగుంతుందో అర్ధం కాని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. రాజధానిపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ ప్రకటన, ఆ తర్వాత జిఎన్ రావు కమిటీ నివేదిక ఈ ఆందోళనకు కారణమని అన్నారు. రాజధానిపై అద్యయనం కోసం ఏర్పాటుచేసిన కమిటీని
జిఎన్ రావు కమిటీ అనే దాని కంటే జగన్మోహన్ రెడ్డి కమిటీ అంటే బాగుంటుందన్నారు.
ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా జిఎన్ రావు కమిటీ నివేదికలు ఉన్నాయన్నారు. టిడిపిని గందరగోళంలో నెట్టేలా జగన్ ప్రకటన ఉంది తప్ప ప్రజలకు ఉపయోగపడేలా లేదన్నారు. ప్రభుత్వం కూడా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలా లేక అధికార వికేంద్రీకరణ జరగాలా అనే సందిగ్ధంలో ఉన్నట్లు కనబుడుతోందని పేర్కోన్నారు.
undefined
హైకోర్టును కర్నూల్ లో పెట్టమని తాము డిమాండ్ చేసినా ఆనాడు చంద్రబాబు వినలేదని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని ఇప్పటి సీఎం జగన్ ఆనాటి సీఎం చంద్రబాబు తమ జాగీర్ అనుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని గ్రౌండ్ లా మార్చి రాష్ట్ర ప్రజలతో ఫుట్ బాల్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
read more ఎన్టీఆర్‌ను తలపిస్తున్న జగన్ పాలన...: మంత్రి అనిల్
ఆంధ్ర ప్రదేశ్ లో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం వుందని బిజెపి చాలాకాలంగా చెబుతోందన్నారు. దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామన్నారు. హైకోర్ట్ రావడం వలన కర్నూల్ కు కొత్తగా వచ్చేదేమీ లేదని...మహా అయితే నాలుగు జిరాక్స్ మిషన్లు, నాలుగు న్యాయవాదుల భవనాలు మాత్రమే వస్తాయన్నారు.
గతంలో చంద్రబాబు నాయుడు పాలనలో కాస్తో కూస్తో మిగిలిన రాష్ట్రాన్ని ముంచేయడానికి జగన్ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. టిడిపి హయాంలో రాజధాని అమరావతి పేరిట నాలుగు వేల ఎకరాలు భూకుంభకోణం జరిగింది వైసిపి ఆరోపిస్తోందని... అలాంటప్పుడు అధికారంలో వున్న మీరు చర్యలు తేసుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. కనీసం వారి అక్రమాలను నిరూపించి ప్రజల ముందు పెట్టాలన్నారు.
రైతుల ఇష్టమో కష్టమో... తమ పొలాలు త్యాగం చేసి మరీ రాజధానికి ఇచ్చారన్నారు. అలాంటి అన్నధాతలను మోసం చేయడం తగదన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా అధిక ఎమ్మెల్యేలు వైసిపికి చెందినవారే గెలిచారని... అలా నమ్మి ఓటేసిన ప్రజలకు అన్యాయం చేయవద్దని సూచించారు.
read more తండ్రి కోసమే విశాఖకు రాజధానిని తరలిస్తున్న జగన్: దేవినేని ఉమ
రాయలసీమలో పంటలు పండక ఏడుస్తుంటే... అమరావతి రైతులను మరోలా ఏడిపిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి అభివృద్ధి వికేంద్రీకరిస్తారా, లేక పరిపాలన కేంద్రీకరిస్తారా అన్నది స్పష్టంగా చెప్పాలన్నారు. రాజాకీయంగా టిడిపిని ఇబ్బంది పెట్టడానికే పరిపాలన వికేంద్రీకరణ అని వైసిపి ఎత్తుగడ వేస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు.
పరిపాలన వికేంద్రీకరణ చేసినంత మాత్రాన ప్రాంతాలు అభివృద్ధి చెందవన్నారు. హైకోర్ట్ ఒక ప్రాంతంలో బెంచ్ ఒక ప్రాంతంలో ఉండాలని ఎవరైనా చెప్తారు.. దానికి జియన్ రావు కమిటీ అవసరమా అని ప్రశ్నించారు. ఏ రాజకీయ పార్టీ అభిప్రాయాన్నయినా జియన్ రావు కమిటీ పరిగణలోకి తీసుకుందా అని ప్రశ్నించారు.
జియన్ రావు కమిటీ నివేదిక చెత్త బుట్టలో వేయడానికి తప్ప ఎందుకు పనిరాదని ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయం విశాఖలో, మంత్రులు అమరావతిలో వుండాలని అంటున్నారని... వారిని విమానాల్లో తరలిస్తారా అని నిలదీశారు.
వెనుకబడిన ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేయండి అంతే కాని పరిపాలన వికేంద్రీకరణ చేయడం వలన అభివృద్ధి జరగదన్నారు.అమరావతిలో సీడెడ్ కాపిటల్ ఉండాలని... మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలన్నారు. అమరవతిలోనే సచివాలయం, అసెంబ్లీ ఉండాలని...ఇది భిజెపి స్పష్టమైన విధానమని విష్ణువర్ధన్ వెల్లడించారు.