తండ్రి కోసమే విశాఖకు రాజధానిని తరలిస్తున్న జగన్: దేవినేని ఉమ

By Arun Kumar P  |  First Published Dec 21, 2019, 2:24 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతి నుండి విశాఖకు తరలించడం వెనుక పెద్ద కుట్ర దాగివుందని... ముఖ్యంగా సీఎం జగన్ తన తండ్రి వైఎస్ఆర్ కోసమే ఈ పని చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. 


విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ రాజధానిపై అద్యయన కోసం ఏర్పాటుచేసింది జీఎస్ రావు కమిటీ కాదని... జగన్మోహన్ రెడ్డి కమిటీ అని టిడిపి నాయకులు, మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కోన్నారు. అమరావతిలో ప్రస్తుతం కొనసాగుతున్న 

రైతుల ఆందోళన చూసి జిఎన్ రావు కూడా దొడ్డిదారిన పారిపోవాల్సి వచ్చిందన్నారు. రైతులకు అన్యాయం చేయాలని చూస్తే ఎవరికైనా అదే గతి పడుతుందన్నారు. ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టినందుకు జగన్ తన పుట్టిన రోజు కానుకగా ప్రజల గుండెల మీద తన్నాడన్నారు. తమ  భవిష్యత్ పై ఆందోళనతో 29 గ్రామాల ప్రజలు రోడ్డు మీద ఉంటే జగన్ పుట్టిన రోజు పండగలు చేసుకుంటున్నాడని... సంబరాల్లో మునిగిపోయాడని ఆరోపించారు. 

Latest Videos

undefined

సీఆర్డీఏ యాక్ట్ గురించి మంత్రులు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని... అసలు మంత్రులకు బుర్ర ఉందా? అని విమర్శించారు. కావాలంటే మరోసారి సీఆర్ఢిఏ యాక్టును పూర్తిగా చదివి అర్థం చేసుకోండని సూచించారు. 

read more  ధర్మవరంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం స్కీమ్ ప్రారంభించిన జగన్

తుళ్లూరులో వరదలు వస్తాయని జిఎన్ రావు కమిటీ తమ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోందని...అసలు బుర్రవుండే వారు ఈ నివేదికను తయారు చేశారా అని దుయ్యబట్టారు. అసలు జీఎన్  రావు నివేదిక మొత్తం జగన్ దగ్గరుండి రాయించినట్లు వుందన్నారు. 

విశాఖలో చాలా భూములను ఇప్పటికే విజయసాయిరెడ్డి కబ్జా చేసాడని ఆరోపించారు. 1000 ఎకరాల్లో ఫ్లాట్స్ కూడా రూపొందించడం ప్రారంభించారన్నారు. సిరిపిరం ఏరియాలో భారీ ఎత్తును భూములు చేతులు మారాయని అన్నారు. అలాగే లంకెలపాలెం ఏరియాలో దళారీలను పెట్టి వేల ఎకరాలు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. 

ఇక వాల్తేరుక్లబ్ దగ్గరలోని 13 ఎకరాల భూమిని ఎంపి విజయసాయి రెడ్డి కబ్జా చేసాడన్నారు. ఈ భూఅక్రమాలపై విచారణను సీబీఐకి అప్పగించాలని టిడిపి డిమాండ్ చేస్తుంటే జగన్ సమాధానం చెప్పడం కాదు కదా పట్టించుకోవడం లేదన్నారు. ఆరోపణలు వస్తున్నా ఈ భూ లావాదేవీల పై విజయసాయిరెడ్డి నోరు మెడపడం లేదన్నారు.

read more  GN Rao Committee : జగన్ చేతుల్లో రాజధాని కమిటీ నివేదిక

భోగాపురం నుండి మధురవాడ వరకు 6000 ఎకరాలు వైసీపీ నేతల చేతుల్లో వున్నాయన్నారు. విశాఖలో కమర్షియల్ కాంప్లెక్స్ భూములు పులివెందుల పంచాయితీ చేసి కాజేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. విశాఖలో ఏ పాపం ఎక్కడ ఉందో అధికారి ప్రవీణ్ ప్రకాష్ కి తెలుసన్నారు. 

భోగాపురం ఎయిర్పోర్ట్ కి వైఎస్ పేరు పెట్టటానికి విశాఖ రాజధాని అంటూ తెరలేపారని... అయితే ప్రభుత్వం మెడలు వంచి రాజధానిని కాపాడుకుంటామని దేవినేని ఉమ హెచ్చరించారు. 
 

click me!