విజయవాడలో టిడిపి అధినేత చంద్రబాబు తలపెట్టిన ఇసుక దీక్ష సందిగ్దంలో పడింది. టిడిపి నాయకులు కోరిన అనుమతులను విజయవాడ పోలీసులు తిరస్కరించారు.
అమరావతి: రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత నిరసిస్తూ ఈ నెల 14వ తేదీన టిడిపి అధినేత చంద్రబాబు నిరసన దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం లో దీక్ష చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుని. పోలీసుల అనుమతిని కూడా కోరారు. అయితే ఈ దీక్ష కోసం టిడిపి నాయకులు కోరిన అనుమతిని విజయవాడ పోలీసులు నిరాకరించారు.
ఇందిరాగాంది స్టేడియంలో దీక్షకు అనుమతి కోరుతూ టీడీపీ నేతలు ఇటీవలే సీపీ ద్వారాకా తిరుమలరావు ను కలిసి లిఖితపూర్వకంగా అనుమతి కోరారు. అయితే వారు అనుమతి కోరిన స్టేడియంలో కేవలం ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు అనుమతి వుందని...అందువల్లే టిడిపి నాయకుల అభ్యర్ధనను తిరస్కరించినట్లు పోలీసులు ప్రకటించారు.ఈ నేపథ్యంలో చంద్రబాబు ఒకరోజు నిరాహార దీక్ష సందిగ్దంలో పడింది.
undefined
read more తెలంగాణలో లేని ఇసుక కొరత ఏపీలోనే ఎందుకంటే...: దేవినేని ఉమ
టిడిపి నాయకులు ఎట్టి పరిస్థితుల్లో ఇదే స్టేడియంలో దీక్ష చేస్తామంటున్నారు. జెడ్ ప్లస్ భద్రత ఉన్న వ్యక్తికి స్టేడియంలో దీక్షకు అనుమతి ఇవ్వాలని కోరినా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అనుమతుల కోసం కోర్టును ఆశ్రయించనున్నట్లు టిడిపి నాయకులు తెలిపారు.
రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకును నిరసిస్తూ టిడిపి అధినేత చంద్రబాబు ఒక రోజు నిరాహార దీక్ష చేపడుతున్నారు. ఇందుకోసం ఇందిరాంగాంధీ స్టేడియంలో కార్యక్రమం నిర్వహించుకునేందుకు అనుమతివ్వాలంటూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సారథ్యంలో టిడిపి నాయకులు విజయవాడ సిపి ద్వారకా తిరుమలరావు ను కలిసి వినతిపత్రం అందించారు.
జెడ్ ప్లస్ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇందిరా గాంధీ స్టేడియంలో దీక్షకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ దీక్షకు అన్ని పక్షాల మద్దతు కోరుతున్నట్లు తెలిపారు. అయితే తాజాగా ఈ దీక్షకు పోలీసులు అనుమతిని నిరాకరించారు.
read more విజయసాయి గారూ...మీరు నోటికి అన్నమే తింటున్నారా..? లేక..: బుద్దా వెంకన్న
ఈ సందర్భంగాా దేవినేని ఉమ మాట్లుడుతూ... సీఎం జగన్ చాలా అమాయకంగా మాట్లాడుతున్నారని అన్నారు. అసలు రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలే జరగలేవని ఆయన మాట్లాడుతున్నారని గుర్తుచేశారు. అలాగయితే నిన్న(బుధవారం) ఐదుగురు కార్మికులకు ఐదు లక్షలు ఎలా ఇచ్చారని ఉమ ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సిమెంట్ కంపెనీల దగ్గర ముడుపుల కోసమే ప్రస్తుతం ఇసుక కృత్రిమ కొరతను సృష్టించారని ఆరోపించారు. ఒక్క సిమెంట్ బస్తా మీద 10 రూపాయలు వసూలు చేస్తున్నట్లుగా సంచలన ఆరోపణలు చేశారు. తంలో ఒక్కటిగా వున్న తెలంగాణలో లేని ఇసుక కొరత ఏపీలో ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.
అధికార పార్టీ నాయకులు వరదలు వచ్చాయని అవగాహన లేకుండా మాట్లాడటం తగదన్నారు. స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలే ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని... వారి వల్లే ఈ ఇసుక కొరత ఏర్పడుతోందన్నారు.
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే స్వయంగా ఇసుక దోపిడీ గురించి మాట్లాడారని గుర్తుచేశారు. అలాగే అమరావతి శిలా పలకం పై తెలుగు లేదని యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ గతంలో మాట్లాడారు. మరి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8 వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియం లోకి మార్చుతూమంటూ జీవో 81 తీసుకు వచ్చారని...ఇది పిచ్చి తుగ్లక్ నిర్ణయం కాదా అని ప్రశ్నించారు.ఎవరి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు.
మాతృ బాషను ఎందుకు విస్మరించారో సీఎం జగన్, లక్ష్మి పార్వతి, యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ సమాధానం చెప్పాలి అన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఉమ డిమాండ్ చేశారు.