ఆంధ్రప్రదేశ్ ఐడియల్ 2019 పోటీలు: పోస్టర్, టీజర్ విడుదల

By narsimha lodeFirst Published Nov 11, 2019, 1:27 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ఐడియల్ 2019 టీజర్, వాల్‌పోస్టర్లను రిలీజ్ చేసిన  ఏపీ  మంత్రి పేర్ని వెంకట రామయ్య (నాని) సోమవారం నాడు ఆవిష్కరించారు. 

మచిలీపట్నం: ఆంధ్రప్రదేశ్ ఐడియల్ 2019 టీజర్, వాల్‌పోస్టర్లను రిలీజ్ చేసిన  ఏపీ  మంత్రి పేర్ని వెంకట రామయ్య (నాని) సోమవారం నాడు ఆవిష్కరించారు. మచిలీపట్నం వాణి ఫంక్షన్ హాల్లో హెల్ప్ @11 లక్ష్య సాధన స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. 

 ఏ .పి.టూరిజం అథారిటీ, విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, ఆంధ్ర యూనివర్సిటీలు కూడ కార్యక్రమాన్నిసంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. యువతలో ఉన్న టాలెంట్ ను వెలికితీసే కార్యక్రమంగా మంత్రి అభిప్రాయపడ్డారు. 16 సంవత్సరాలు నుండి 25 వరకు యువతీ యువకులకు ప్రవేశం ఉంటుందని మంత్రి ప్రకటించారు.

alo read :'పవన్ కళ్యాణ్‌కు ముగ్గురు భార్యలు, నలుగురు పిల్లలు ఏ స్కూళ్లో చదువుతున్నారు'

ఈ కార్యక్రమంలో పాల్గొనేవారంతా ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవడానికి వెయ్యి రూపాయాలను చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.

రిజిస్ట్రేషన్ ఫీజులోని 50 శాతం పేద పిల్లల పుస్తకాల నిమిత్తం ఉపయోగించనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. నవంబర్ 31, డిసెంబర్ 1 న తిరుపతిలో, డిసెంబర్ 7,8 విజయవాడలో , డిసెంబర్  14,15 విశాఖపట్నంలో కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

డిసెంబర్ 25 విశాఖపట్నంలో జరిగే డాన్స్ , మ్యూజిక్ ఫైనల్స్ ను నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ప్రథమ విజేతకు లక్ష రూపాయాలు, రెండో విజేతకు 75 వేలు, మూడో విజేతకు 50వేలు అందించనున్నట్టుగా నిర్వాహకులు ప్రకటించారు.

click me!