సెల్ఫీ మోజు: కృష్ణానదిలో పడి విద్యార్థిని మృతి, మిత్రుడు సేఫ్

By telugu team  |  First Published Nov 11, 2019, 1:15 PM IST

మిత్రుడితో కలిసి సెల్ఫీ తీసుకునే మోజులో కృష్ణానదిలో పడిపోయి ఇంటర్మీడియట్ విద్యార్థిని ధనలక్ష్మి ప్రాణాలు కోల్పోయింది. మిత్రుడు మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. 


విజయవాడ: గలగలాపారే కృష్ణా జలాలతో స్వీయచిత్రం తీసుకొనే ప్రయత్నంలో బీటెక్‌ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. సముద్రం, నదులు, వాగుల వద్ద సెల్ఫీలు ఎంత ప్రమాదకరమో గుంటూరు జిల్లా నకరికల్లు మండ లం కండ్లగుంట వద్ద చోటుచేసుకున్న ఘటనతో మరో సారి నిరూపితమైంది. 

వివరాలు.. నరసరావుపేట పట్టణం వెంగళ్‌ రెడ్డినగర్‌కు చెందిన బీటెక్‌ విద్యార్థిని ఐలా ధనలక్ష్మీ(20) స్నేహితులతో కలిసి కండ్లగుంటకు బయలుదేరింది. మార్గం మధ్యలో గుంటూరు బ్రాంచ్‌ కెనాల్ వంతెనపై సెల్పీ తీసుకోవాలనుకుంది. స్నేహితుడు ముఖేశ్‌తో కలిసి సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ ఇద్దరూ కాలువలో పడిపోయారు. 

Latest Videos

undefined

ఒడ్డున ఉన్న స్నేహితులు వెంటనే అప్రమత్తమై గట్టిగా కేకలు వేయడంతో అక్కడున్న స్థానికులు గల్లంతైన వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ముఖేశ్‌ ప్రాణాలతో బయటపడగా..ధనలక్ష్మిని ఒడ్డుకు చేర్చినప్పటికీ  తీవ్ర అస్వస్థతకు  గురైంది. పరిస్థితి విషమంగా ఉండటంతో నరసరావుపేటలోని ఓ ఆస్పత్రికి తరలించారు. 

పరీక్షించిన వైద్యులు ఆమె మృతిచెందినట్లు ధ్రువీకరించారు. శుభకార్యానికి వెళుతూ కుమార్తె విగతజీవిగా మారడంతో విద్యార్థిని కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

click me!