భూమా అఖిలప్రియ భర్తపై కేసు.. వైసీపీ ప్రభుత్వంపై అనురాధ విమర్శలు

By telugu team  |  First Published Oct 10, 2019, 12:40 PM IST

అఖిలప్రియ భర్త భార్గవ్ చాలా ఉన్నతమైన వ్యక్తి అని, చదువుకున్న వ్యక్తి అని ఆమె చెప్పారు. ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో మాత్రం ప్రభుత్వం భిన్నంగా ప్రవర్తించిందని మండిపడ్డారు. శ్రీధర్ రెడ్డడిపై బాధితురాలు సరళ ఐదుపేజీల ఫిర్యాదు  రాసిందని... దానిని బట్టి  పాలన ఎలా ఉందో తెలిసిపోతోందని ఆయన అన్నారు.


వైసీపీ ప్రభుత్వం మహిళలను ఇబ్బందులకు గురిచేస్తోందని టీడీపీ మహిళానేత పంచుమర్తి అనురాధ ఆరోపించారు. గురువారం విజయవాడలో ఆమె విలేకరుల సమావేశంలో నిర్వహించారు. టీడీపీ మహిళా నేతలను ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా వైసీపీ నేతలు పనిచేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

ఇటీవల మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. కాగా... ఆ విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. వైసీపీ నేతలను కొట్టారంటూ భార్గవ్ పై కేసు పెట్టారని ఆమె అన్నారు.  భార్గవ్ పై 307సెక్షన్ కింద ఎలా కేసు పెడతారని ఆమె ప్రశ్నించారు.

Latest Videos

undefined

అఖిలప్రియ భర్త భార్గవ్ చాలా ఉన్నతమైన వ్యక్తి అని, చదువుకున్న వ్యక్తి అని ఆమె చెప్పారు. ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో మాత్రం ప్రభుత్వం భిన్నంగా ప్రవర్తించిందని మండిపడ్డారు. శ్రీధర్ రెడ్డడిపై బాధితురాలు సరళ ఐదుపేజీల ఫిర్యాదు  రాసిందని... దానిని బట్టి  పాలన ఎలా ఉందో తెలిసిపోతోందని ఆయన అన్నారు.

ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని అరెస్టు  చేయడం తర్వాత బెయిల్ మీద వదిలేయడం అంతా ఒక డ్రామా అని ఆమె ఆరోపించారు.  అవినీతి సామ్రాజ్యాన్ని ఎలా పంచుకోవాలనేదానిపై పంచాయతీ చేస్తున్నారని విమర్శించారు.

వనజాక్షికి ఎలాంటి అన్యాయం జరగలేదని... సరళ విషయంలో జరిగినా యాక్షన్ తీసుకోలేదని మండిపడ్డారు. నదిలో మునిగిపోయిన బోటు విషయంలో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. దేవీపట్నం బోటు విషయంలో పదహారు గంటలపాటు ఎందుకు యాక్షన్ తీసుకోలేదని ప్రశ్నించారు. 

జగన్మోహన్ రెడ్డి అన్నం తినటం లేదా.. ఆయనలో చలనం లేదా అంటూ తీవ్రంగా విమర్శలు చేశారు.  జగన్మోహన్ రెడ్డి కూతురు చదువు కోసం విదేశాలకు వెళ్ళారంటే, ప్రతిపక్షంలో ఉండి కూడా తాము మాట్లాడలేదన్నారు.

బోటు ప్రమాదంలో చనిపోయిన వారి విషయంలో సరయిన సమాధానం చెప్పే వరకూ ప్రతిపక్షం అడుగుతూనే ఉంటుందన్నారు. బోటు ప్రమాదంపై చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యమన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

click me!