Feb 9, 2023, 4:52 PM IST
జనగామ : మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మహాప్రస్థాన యాత్రలో భాగంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలోనే కడియం శ్రీహరి ఆమెపై విమర్శలు చేయగా తాజాగా షర్మిల కౌంటర్ ఇచ్చారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తెలంగాణ వ్యతిరేకి అంటూ కడియం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... లక్షా యాభైవేల ఎకరాలకు నీళ్లిచ్చినందుకు, 30 వేల ఇళ్లు కట్టించినందుకు, రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించినందుకు వైఎస్సార్ తెలంగాణ వ్యతిరేకా? ఉద్యమం పేరు చెప్పి అధికారం, పదవులు అనుభవిస్తున్న నువ్వు అసలు తెలంగాణ ద్రోహివి అంటూ కడియంపై మండిపడ్డారు షర్మిల.